ఆ భూమి మాకు కావాల్సిందే
రెవెన్యూ అధికారులపై గణపురం విలేకర్ల ఒత్తిడి
కాస్తులో ఉన్న వారిని కాదని కబ్జా చేసే ప్రయత్నం …?
ఏ అధికారం లేకున్నా అసలు పట్టాదారులను బెదిరించే యత్నం …?
భూమి ప్రభుత్వానిది అంటున్న రెవెన్యూ అధికారులు
అధికారుల పరిచయాలతోనో, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నామనో, ప్రభుత్వ రెవెన్యూ నిబంధనలను అనుసరించి ఎవరికి నష్టం జరగకుండా ఇంకొకరి పొట్ట కొట్టకుండా భూమిని సంపాదించడం ఓ రీతి, మరీ కావాలనుకుంటే పైసా పైసా పోగుచేసి సర్కారు ధరకే భూమిని కొనుగోలు చేయడం ఇదో పద్ధతి. కానీ అలాంటివి ఏమి లేకుండా పేద ప్రజల పొట్ట గొట్టి కొన్ని ఏండ్ల నుంచి భూమిని కొనుగోలు చేసుకొని అదే జీవాణాధారంగా బతుకుతున్న వారి భూమిని అధికారులు పరిచయం ఉన్నారని, ఎం చెపితే అదిచేస్తారని ఇష్టారీతిన ప్రవర్తిస్తే నిజంగా అది దోపిడీ, కబ్జానే అవుతుంది. సరిగ్గా అలాగే ప్రవర్తిస్తున్నారట జయశంకర్ జిల్లా గణపురం మండల కేంద్రానికి సంబంధించిన విలేఖరులు కొందరు. పందుల పెంపకంతో జీవనం సాగిస్తున్న వారికి సంబంధించిన భూమిని కొంతమంది విలేఖరులు కలిసి తమదే భూమి అంటూ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండతో వీరు భూమిని మొత్తంగా కాజేయాలని చూస్తున్నట్లు వారు ఆవేదన చెందారు.
ఇదీ కబ్జా కహానీ…!
గణపురం విలేకర్ల భూదాహం పై భాదితులు పూర్తి వివరాలను న్యూస్10 కు అందించారు. వారు అందించిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గ్రామ శివారులో ప్రభుత్వ పాఠశాల కు కొద్ది దూరంలో204/80,204/156 సర్వే నంబర్ లో గతంలో 500ఎకరాల భూమి ఉండేది. పేదలకు ఇతరులకు పంచగ అక్కడ కొంత భూమి మిగిలి పోయింది. అయితే ఎప్పటి నుంచో రెవెన్యూ అధికారుల అండదండలతో ఇక్కడ భూమిని కొట్టేయాలని గణపురం లో ఉన్న కొందరి విలేకరులకు ఆశ పుట్టింది. ఏ భూమి లేని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కొంత భూమి నివాసం కోసం కావాలని ఏ విలేకరి భావించిన తప్పు లేదు. కానీ కేవలం దూరాశతో ఎకరాల కొద్దీ భూమిని కబాలించాలని విలేకరులు వ్యూహం రచించడం తప్పు. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. కేవలం 8 మంది విలేకర్లు విలేకరి కానీ వాళ్ళను ఇద్దరిని కలుపుకొని మైలారం వద్ద 2 ఎకరాల స్థలం ఎవరూ ఏమనకుంటే మరికొన్ని ఎకరాలకు ప్లాన్ చేసుకున్నారు. ఐతే ఆలోచన వచ్చిన వెంటనే అప్పటి తహశీల్దార్ దివాకరరెడ్డి ని కలిసి భూమి కావాలని విన్నవించుకున్నారు. అసలే విలేకర్లు ఎందుకొచ్చిన తంటా అని చేస్తా.. చూస్త అని చెప్పిన తహశీల్దార్ అక్కడనుంచి బదిలీ ఐయాక వీరికి ఇంటి స్థలాల కోసమని పట్టాలు జారీ చేసాడు. ఐయితే ఈ విషయం ఆనోట ఈ నోటా అంత పాకడంతో కొత్తగా వచ్చిన తహశీల్దార్ సమ్మయ్య కు ఆ పట్టాలను రద్దు చేయాలని, ఆ స్థలంలో ఇప్పటికే కొందరు వ్యవసాయం చే సుకుంటున్నారని అవి పట్టా భూములని ఫిర్యాదులు వెళ్లాయి దింతో అన్ని పరిశీలించిన తహశీల్దార్ విలేకర్ల పట్టాలను రద్దు చేస్తూ వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా విలేకర్లు మళ్ళీ తమ వ్యూహాలకు పదును పెట్టారు. తమకు భూములు ఇవ్వాల్సిందేనని ప్రస్తుత తహశీల్దార్ పాలకుర్తి మాదవికి ఏకంగా ఈ విలేకర్లు అల్టిమేటం జారీ చేశారట. దీంతో తహశీల్దార్ ససేమిరా అనడంతో అధికారి ఉంటున్న అధికారిక నివాసానికి వెళ్లి వాగ్వాదానికి దిగారట. అయిన తహశీల్దార్ వినక పోవడంతో లాభం లేదనుకుని వారే స్వయంగా రంగం లోకి దిగారు. మైలారం వద్ద ఉన్న భూమిలోకి వెళ్లి అక్కడ సాగు చేసుకుంటున్న వారితో ఇవి మాభూములు అంటూ బహిరంగంగా గొడవకు దిగారట. ఓ విలేకరి ఐయితే ఓ అడుగు ముందుకు వేసి భూములు వదిలి పోండి లేదంటే అంతుచూస్తాం… అంటూ బెదిరింపులకు దిగినట్లు బాధితురాలు బోరున విలపించారు. కాళ్ళ వేళ్ళ పడిన వినకుండా విఆర్వో, విఆర్ఏ పోలీసుల సాయంతో భూమిలో వేసుకున్న గుడిసెను కూలగొట్టినట్లు వారు తెలిపారు.
విలేకరులు బెదిరిస్తున్నారు….
తాము గత రెండు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిని గణపురం విలేకరులు కొంతమంది బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చుస్తున్నారని బాధితురాలు లోకిని సమ్మక్క అంటున్నారు. తమను బెదిరింపులకు గురి చేస్తు భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని బోరున విలపించారు.పట్టా పాస్ బుక్ అన్ని తమపేరుపైనే ఉన్న అన్యాయంగా భూమిని దక్కించుకోవాలని చుస్తున్నారని తెలిపింది. అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంది. కాగా ఈ విషయమై వివరణ కోసం గణపురం తహశీల్దార్ పాలకుర్తి మాధవికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఆఫ్ వస్తోంది .ఎంతగా ప్రయత్నించిన ఫోన్ కలువలేదు.