వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట మల్లికుంట శివారు 93 సర్వే నెంబర్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది… ప్రభుత్వ అసైన్డ్ స్థలంగా చెపుతున్న 1.26 ఎకరాల్లో కొంతమంది ఓ ఎమ్మెల్యే సహకారంతో అనుచరులు ఇక్కడ పాగా వేసి రాత్రికి రాత్రే కాలనీ ఏర్పాటు చేసి ఇంటి నంబర్లు, కరెంట్ సౌకర్యం లాంటి అన్ని సౌకర్యాలు పొందడం అందరిని ఆశ్చర్య పరిచింది.
నెలల తరబడి తిరిగిన కనీసం ఏమాత్రం సహకరించని, పనిచేయని అధికారులు ఈ సర్వే నంబర్లో రెడీమేడ్ ఇండ్లు వెలియగానే అసలు ఎందుకు సహకరించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… ప్రజాప్రతినిధి కి సంబందించిన వ్యవహారం కనుక అధికారులు అక్కడ పరపతి పొందడం కోసం ఆడిగినపని చిటికెలో చేసి పెట్టినట్లు రాత్రికి రాత్రే వెలసిన ఆ కాలనీ చూస్తే అర్థం అవుతుంది… ఇంత జరిగినా ప్రభుత్వ అసైన్డ్ భూమి అన్యాక్రాంతం పై విమర్శలు వస్తున్న అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు.
ప్రజాప్రతినిధి అనుచరులు అస్థలంలో రెడీమేడ్ ఇండ్లు బిగించారని తెలిసి స్థానిక రెవెన్యూ అధికారులకు ఫోన్ చేస్తే వారే స్వయంగా అది నూటికి నూరు పాళ్లు ప్రభుత్వ అసైన్డ్ భూమేనని ఒప్పుకున్నారు… ఈ విషయంలో గీసుగొండ మండల రెవెన్యూ అధికారులు ఖచ్చితంగానే ఉన్న మరి ప్రభుత్వ అసైన్డ్ భూమిని చదునుచేసి ప్లాటింగ్ చేసి సిమెంట్ బ్లాక్ లు తెచ్చి ఇండ్లు నిర్మించి, ఇంటి నంబర్ లు, కరెంట్ మీటర్ ఇలా అన్ని సౌకర్యాలు కల్పించుకొని అక్కడే కొంతమంది ఉంటుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారనేది ప్రశ్న… 93 సర్వే నంబర్ లో ఈ తతంగం అంతా నడుస్తున్న అధికారులు ఎందుకు గమ్మున ఉంటున్నారని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రజాప్రతినిధి అనుచరులు సర్కార్ భూమి లోనే పాగా వేశారని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికుల్లో సైతం అనుమానమే కలుగుతుంది. ఇంతజరుగుతున్న ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించిన పాపాన పోలేదు… ప్రభుత్వ అసైన్డ్ స్థలంలో వేసిన రెడీమేడ్ ఇండ్లను తొలగించి ప్రభుత్వ స్థలం అని చూసించే బోర్డ్ పెట్టలేదు… అడిగితే ప్రభుత్వ స్థలమని చెపుతున్న అధికారులు మరి అన్ని సక్రమంగా ఉంటే అక్కడ అక్రమంగా చేసిన నిర్మాణాలను ఎందుకు తొలగించడం లేదో అర్థం కాలేదు… అడగ్గానే అన్ని చిటికెలో సమకూర్చిన అధికారులు అటు వైపు ఎందుకు తొంగి చూడడం లేదో వారికే తెలియాలి.
93 సర్వే నంబర్ విషయంలో ఏ అదృశ్య శక్తి అధికారులను అడ్డుకుంటుందో తెలియటం లేదు… ఈ సర్వే నంబర్ లో అక్రమంగా ఇండ్లు వెలిసాయని తేటతెల్లం ఐయిన ఉన్నతాదికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అసలు ఎం అర్థం కాకుండా ఉంది… అధికారులు ఇలాగే కాలయాపన చేసి ఎదో సాకుతో ప్రజాప్రతినిధి అనుచరులకే భూమిని కట్టబెట్టాల ఉన్నారని స్థానికులు అంటున్నారు… గీసుకొండ మండల రెవెన్యూ అధికారులు ఆ ప్రజాప్రతినిధి ఎంత చెపితే అంతలా అన్నట్లు ప్రవర్తిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.