24 గంటల్లో 1035 కొత్త కరోనా కేసులు

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 1035 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని..40 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. సామాజిక దూరం పాటించడంతోనే కరోనాను కట్టడి చేయగలమని కేంద్రం పేర్కొంది. కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లా డుతు ఈ విషయాన్ని వెల్లడించారు.దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,447 కరోనా కేసులు నమోదయ్యాయని, శనివారం వరకు 239 మంది కరోనా మహమ్మారి బారినపడి చనిపోయా రన్నారు. 642 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని.

24 గంటల్లో 1035 కొత్త కరోనా కేసులు- news10.app

దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 586 కోవిడ్‌-19 ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. లక్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని, కరోనాతో పోరాడటానికి లాక్‌డౌన్‌, నియంత్రణ చర్యలు చాలా ముఖ్యమైనవన్నారు. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవి’ అని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here