హ(ర)మేష కంట్రోల్…?

ఆయన తలుచుకుంటే హన్మకొండ జిల్లాలోని ప్రముఖ పార బాయిల్డ్ మిల్ యాజమాన్యాలకు ఎలాంటి టెన్షన్లు ఉండవట…..మిల్లులు ప్రభుత్వ నిబంధనలకు ఎంత వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి అడ్డంకులు ఉండవట….ఆ మిల్లుల యాజమాన్యాలు హ(ర)మేష ఎం చేసిన చెల్లుబాటు అవుతుందని తెలుస్తుంది…ఈ మిల్లుల వ్యవహారాలను కాలుష్య నియంత్రణ మండలికి ఏజెంట్ గా ఉన్న ఓ వ్యక్తి అధికారులతో మాట్లాడి లోపాలను సక్రమం చేస్తూ
కాలుష్య నియంత్రణ మండలి అధికారులనే కంట్రోల్ చేస్తున్నట్లు తెలిసింది….

టెన్షన్ ఎందుకు…?

“టెన్షన్ ఎందుకు దండగా క్రేన్ వక్కపలుకులు ఉండగా” అనే యాడ్ మనం నిత్యం టీవీల్లో వ్యాపార ప్రకటన చూస్తుంటాం. ఓ వ్యక్తి టెన్షన్ లో ఉన్నప్పుడు మరో వ్యక్తి వచ్చి ఈ డైలాగ్ ను చెప్తుంటాడు. అచ్చం ఆ డైలాగ్ లాగే ఈ మధ్యన హన్మకొండ జిల్లాలోని కొంతమంది రైస్ మిల్లర్ లు న్యూస్-10 లో వస్తున్న కథనాలపై ఒకరికొకరు “టెన్షన్ ఎందుకు దండగా ఆ ఏజెంట్ ఉండగా” అని ధీమాగా ఉంటున్నారట
హన్మకొండ జిల్లా రాంపూర్ లో ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లుల వల్ల కాలుష్యం పెరిగిపోతున్నప్పటికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తికూడా చూడటానికి ఇష్టపడటంలేదట ఒకవేళ తనిఖీలు నిర్వహించాలని వారు అనుకున్నప్పటికి మిల్లర్ లకు సంబంధించిన ఆ ఏజెంట్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను తనిఖీలు చేయకుండా కంట్రోల్ చేస్తుంటాడట ఆ పారాబాయిల్డ్ రైస్ మిల్లర్ లకు కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నుండి ఎటువంటి ఒత్తిడి వచ్చిన ఈ మిల్లర్లు ఆ ఏజెంట్ నే సంప్రదిస్తారని సమాచారం. గత కొన్నిసంవత్సరాలుగా మిల్లర్ లకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు బ్రోకర్ గా వ్యవహరిస్తున్న ఆ ఏజెంట్ ఉన్నంతకాలం ఆ మిల్లులపై ఎటువంటి చర్యలు అధికారులు తీసుకోరని ప్రచారం జరుగుతోంది .

తనిఖీలేవి మేడం……?

వ్యర్థశుద్ది కర్మాగారాలు( ETP) లు లేకున్నా…కొన్ని మిల్లుల్లో ఉండి పనిచేయకున్న….కలుషిత నీటిని కెనాల్ లోకి వదిలి కాలుష్య కారకం అవుతున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేయడానికి ఏమాత్రం ధైర్యం చేయడం లేదు…ఇదంతా ఆ ఏజెంట్ మూలంగానే అన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… మిల్లర్లకు ,కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు అనుసంధాన కర్త గా ఏజెంట్ వ్యవహరిస్తూ కావాల్సింది ముట్టజెప్పుతున్నందునే అధికారులు ఆ పార బాయిల్డ్ మిల్లుల వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదని విశ్వసనీయ సమాచారం ….మూడు రోజుల్లో తనిఖీలు చేస్తామని పదిరోజుల క్రితం చెప్పిన కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ సునిత ఇప్పటివరకు తనిఖీలు ఎందుకు చేయలేదో ఆ అధికారికే తెలియాలి..రహదారిపై చెత్త వేయకూడదు…కాలుష్య కారకం కాకూడదని రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో పెద్ద పెద్ద బోర్డ్ లు ఏర్పాటు చేసిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మిల్లుల వల్ల ఇంతగా కాలుష్యం అవుతున్న ఎందుకు గమ్మున వుంటున్నారో అందులో మర్మం ఎంటో తెలియాల్సివుంది…. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా…ఏజెంట్ పైరవీకి అధికారులు తలోగ్గుతారా…చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here