విద్యుత్ శాఖ అధికారులు తమకు నచ్చితే చాలు కొందరికి ఎలా సహకరిస్తారో..వారి కోసం తమకు తోచింది ఎలా చేస్తారో అని చెప్పడానికి ఇదో సజీవ సాక్ష్యం…అనుమతులు లేని వెంచర్ కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నా… వారి శాఖ నిబంధనలను వారే పక్కన పెట్టి ఓ రియల్టర్ కు తమ శక్తి మేర అడ్డదారిలో సహకరించారు…ఇంతకీ ఈ విషయం వారి పై అధికారులకు, ఆ…పై అధికారి సి ఎం డి కి తెలుసో లేదో…ఆయన దృష్టికి అసలు పోయిందో లేదో తెలియదు కాని వెంచర్ లో విద్యుత్ అధికారులు ఏకంగా స్తంభాలు వేసి మేలు చేశారు….వెంచర్ లో ఓ గది ఉంది ఆ గదికి ఓ ఇంటినంబర్ ఉంది అందుకే విద్యుత్ కనెక్షన్ ఇచ్చామని సన్నాయి నొక్కులు నొక్కుతున్న విద్యుత్ అధికారులు ….కనెక్షన్ సరే అసలు ఆ వెంచర్ లో ఏకంగా స్తంభాలు ఎందుకు ఏర్పాటు చేశారో సమాధానం చెప్పడం లేదు…..పొరపడ్డాం అని వాటిని తొలగించే పని చేయడం లేదు…..అవును మరి రెండు ప్రభుత్వ శాఖలే ఒకటేమో మున్సిపల్ కార్పోరేషన్ మరొకటేమో విద్యుత్ శాఖ కానీ ఓ డిపార్ట్మెంట్ కు అక్రమమైంది మరో డిపార్ట్మెంట్ కు ఎలా సక్రమమైందో అర్ధంకాని పరిస్థితి …ఒకరేమో ఆ వెంచర్ అక్రమమని హద్దురాళ్లు తొలగించారు. మరొకరేమో అదే అక్రమ వెంచర్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు.
జిడబ్ల్యూఎంసి కి అక్రమమైంది?టిఎస్ఎన్పీడిసిఎల్ కు సక్రమమెలా?
గ్రేటర్ వరంగల్ గొర్రెకుంట శివారు హరిహర ఎస్టేట్ కు ఎదురుగా ఉన్న వెంచర్ అక్రమమని, గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ నుండి ఎలాంటి అనుమతి లేదని, వెంచర్ లోని హద్దురాళ్లను గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు.కానీ నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ అధికారులు మాత్రం దర్జాగా ఆ అక్రమ వెంచర్ లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి రియల్టర్ కు బాగానే సహకరించినట్లు తెలిసింది. విద్యుత్ అధికారుల సహకారం వెనుక ముడుపులు మహత్యం ఉండేవుంటుందని పలువురి నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కార్పోరేషన్ కు అక్రమమైన వెంచర్ టిఎస్ఎన్పీడిసిఎల్ కు ఎలా సక్రమమైందో విద్యుత్ అధికారులకే తెలియాలి.ఇప్పటికైనా టిఎస్ఎన్పీడిసిఎల్ సిఎండి సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే