రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాఖాలో ఓ ఉద్యోగిని తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ములుగు జిల్లాలో బాగానే వినిపిస్తున్నాయి…జిల్లాలోని ఏటూరునాగారం ఏ సి డి పి ఓ గా పోస్టింగ్ ఉన్న ప్రేమలత అధికారులను ఎదో రకంగా మాయ చేసి సీనియర్లను సైతం పక్కన పెట్టి జిల్లా అధికారిగా రెండోసారి పోస్టింగ్ తెచ్చుకొని రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులకే సవాల్ విసిరే స్థాయిలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి….మొన్నటివరకు ములుగు జిల్లా సంక్షేమ అధికారిగా కొనసాగి తనకంటే సీనియర్లయిన సి డి పి ఓ లకు సైతం బాస్ గా మారి దర్పం వెలగబెట్టిన ఈ ఉద్యోగిని మేడారం జాతరకు ముందు ఆ జిల్లా అధికారి పోస్ట్ నుంచి తొలగించి తిరిగి ఏటూరునాగారం ఏ సి డి పి ఓ గా కొనసాగాలని ఉన్నతాధికారులు చెప్పిన కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడని ఏ సి డి పి ఓ జాతర ముగిసిన వెంటనే తిరిగి జిల్లా అధికారిగా పోస్టింగ్ తెచ్చుకుంది….ఈసారి తాను ఉద్యోగం చేస్తున్న శాఖనే మార్చి మైనార్టీ శాఖ లో జిల్లా అధికారిగా మారిపోయింది…. ములుగు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గా బాధ్యతలు తీసుకుంది…జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఏ అర్హతలు చూశారో…ఏ నిబంధనల మేరకు జిల్లా అధికారిగా ఏ సి డి పి ఓ కు బాధ్యతలు అప్పగించారో తెలియదు కాని ఎన్నికల సంఘం నిబంధనలు సైతం కలెక్టర్ ఉల్లంఘించి ఏ సి డి పి ఓ ను జిల్లా అధికారిగా నియమించారని ఆరోపణలు సైతం ఉన్నాయి…
జిల్లా అధికారి పోస్టే కావాలి….
నిబంధనలు కాదని అసలు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అర్హులే లేనట్లు ఓ ఏ సి డి పి ఓ స్థాయి ఉద్యోగిని జిల్లా సంక్షేమ అధికారిగా సి డి పి ఓ లు ఇతర సీనియర్లకు బాస్ గా నియమించగా అధికారులు తప్పులో కాలేసినట్లు తెలుసుకొని ఆ బాద్యతలనుంచి తప్పించిన తిరిగి అతి కొద్దిరోజుల్లోనే మళ్ళీ జిల్లా అధికారిగా ఏ సి డి పి ఓ మారిపోయింది…అసలు ఉద్యోగాన్ని కాదని తాను జిల్లా అధికారిగా తప్ప వేరే పోస్టింగ్ లో కొనసాగలేనని తన సహచరుల వద్ద ఆ ఏ సి డి పి ఓ తన మనసులో మాట బయట పెట్టినట్లు తెలిసింది…ఈ పోస్టింగ్ తెచ్చుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేసిన ఏ సి డి పి ఓ ప్రస్తుత ములుగు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కి ఆ జిల్లా కలెక్టర్ బాగానే సహకరిస్తున్నట్లు తెలుస్తుంది….గతంలో ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కృష్ణ ఆదిత్య ఈమెను డి డబ్ల్యు ఓ గా నియమిస్తే ,ప్రస్తుత కలెక్టర్ ఇలా త్రిపాఠి మైనార్టీ సంక్షేమ అధికారిణిగా ఏ సి డి పి ఓ ను నియమించారు….జిల్లాలోని ఉద్యోగుల నుంచి విమర్శలు వస్తున్న ఓ జూనియర్ కు అది ఏ సి డి పి ఓ స్థాయి ఉద్యోగికి జిల్లా అధికారిగా ఎలా బాధ్యతలు ఇస్తారని ప్రశ్నిస్తున్న కలెక్టర్ మాత్రం అవి ఏమాత్రం పట్టించుకోవడం లేదు…..ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అక్రమాన్ని సక్రమం అని సమర్దించుకునే స్థాయిలో ఉన్నారంటే ఆ ఉద్యోగినికి పూర్తిగా సహకరిస్తున్నట్లు అర్థం అవుతుంది…జిల్లా అధికారిగా నియమించబడ్డ ఏ సి డి పి ఓ సైతం తనను ఎవరేం చేయలేరని ఎవరి మీద పడితే వారి మీద కామెంట్లు చేస్తుందంటే జిల్లా కలెక్టర్ ఆమెకు ఎంతటి భరోసా కలిగించారో అర్థం చేసుకోవచ్చు….
మంత్రి సీతక్క దృష్టికి పోలేదా….?
ఏటూరునాగారం ఏ సి డి పి ఓ ను ములుగు జిల్లా డి డబ్ల్యు ఓ గా నియమించారు …స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో జూనియర్లకు అందలం అంటూ న్యూస్10 గతంలో కథనం వెలువరిస్తే డి డబ్ల్యు ఓ గా ఉన్న ఏ సి డి పి ఓ ను బాద్యతలనుంచి తప్పించి అర్హులను డి డబ్ల్యు ఓ గా నియమించగా …మళ్ళీ అదే ఏ సి డి పి ఓ ను శాఖను మార్చి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణిగా నియమించిన విషయం ఇంకా మంత్రి సీతక్క దృష్టికి రాలేదా…అని ఇక్కడి ఉద్యోగులు అంటున్నారు…లేదా ఈ విషయం మొత్తం తెలిసిన స్పందించడానికి సుముఖంగా లేరా అనే విషయం తెలియాలి…..కొద్దిరోజుల క్రితం ములుగు జిల్లాలో పోస్టింగులు తదితర విషయాలపై కొందరు సి డి పి ఓ లు ఇతర ఉద్యోగులు తనను కలిసి పిర్యాదు చేస్తే సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క ఇప్పుడెందుకు ఈ విషయంలో ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో వారికే తెలియాలి….ఓ ఏ సి డి పి ఓ ను జిల్లా అధికారిగా నియమించి అక్కడి ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చేలా చేసిన జిల్లా కలెక్టర్ నిర్ణయంపై మంత్రి సీతక్క స్పందిస్తారా….లేదా చూడాలి….