సారు దిగొచ్చిండు…ఆవును నిజం కేసీఆర్ సారు దిగొచ్చిండు…తెలంగాణ సాధన ఆ అనంతరం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గా కొనసాగి అధికారంలో ఉండి ప్రజలకు దూరం అయ్యాడు…ప్రజలను పట్టించుకోకుండా తన పామ్ హౌస్ కే పరిమితం అయ్యాడని ప్రతిపక్షాలచేత నిత్యం విమర్శలకు గురైన కేసీఆర్ ఇప్పుడు తన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు కనపడుతుంది…. అధికారం కోల్పోయి ప్రగతి భవన్ కు దూరమయి… కనీసం తన సెక్యూరిటీ కి కూడా చెప్పకుండా పామ్ హౌస్ కు వెళ్లిపోయిన గులాబీ అధినేత మళ్ళీ ఉద్యమ కేసీఆర్ పాత కేసీఆర్ లాగా జనానికి దగ్గర కావాలని చూస్తున్నారు…అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రోడ్ షో లతో సుడిగాలి పర్యటన లు చేస్తున్నారు….నెమ్మదిగా,, నింపాదిగా బస్సు యాత్ర చేపడుతు ఆయా నియోజకవర్గాల ప్రజలను ,నాయకులను పలకరిస్తూ…ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు….ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం బస్సు యాత్రలో ఖమ్మం వెళ్తున్న గులాబీ బాస్ కేసీఆర్
ఖమ్మంకు వెళ్ళే దారిలో తొర్రూరు, ఎల్లంపేట స్టేజ్ తండాలో ఒక హోటల్ వద్ద ఆగి.. ప్రజలతో ముచ్చటించి పాత కేసీఆర్ .మళ్ళీ వచ్చాడు అనిపించాడు… కేసీఆర్ .మాట ముచ్చట తో సంతోషం వ్యక్తం చేసిన అక్కడి జనం అవును కేసీఆర్ సార్ దిగొచ్చిండు… అనుకున్నారు….