సబ్ రిజిస్ట్రార్ చేతివాటం

ఆ సబ్ రిజిస్ట్రార్ అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో బరితెగించినట్లు తెలుస్తోంది. తన అధికారాన్ని అక్రమార్జనకు వాడుకుంటున్నట్లు ఆరోపణలు సైతం జోరుగా వినిపిస్తున్నాయి.ఆ సబ్ రిజిస్ట్రార్ కు అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడమంటే చాలా మక్కువని సారు చేసిన రిజిస్ట్రేషన్ లు చూస్తే చాలా ఈజీగా చెప్పవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తున్న ఈ సబ్ రిజిస్ట్రార్ ను చూస్తున్న రియల్టర్ లు అబ్బో.. ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రారా …మజాకా…? సారుకు కావాల్సింది ఇస్తే ఏ రిజిస్ట్రేషన్ అయినా క్షణాల్లో చేపించొచ్చని ఆ సబ్ రిజిస్ట్రార్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది…

48 గంటల్లోనే 26 ప్లాట్లు రిజిస్ట్రేషన్..

కేవలం 48 గంటల్లోనే అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి ఆ సబ్ రిజిస్ట్రార్ 7 లక్షల 80 వేలు వెనకేసినట్లు ఆరోపణలున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 44 వ డివిజన్ లో ఓ అనుమతి లేని వెంచర్ లోని 26 ప్లాట్లను ఈ సబ్ రిజిస్ట్రార్ 48 గంటల్లోనే రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. ఈ నెల 18 వ తేదీన 16 ప్లాట్లు ,20 వ తేదీన 10 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన ఈ సారు ఆ వెంచర్ లోని మిగిలిన ప్లాట్లను సైతం రిజిస్ట్రేషన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం కోసం సదరు సబ్ రిజిస్ట్రార్ ఒక్కో ప్లాటుకు 30 వేలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… అక్రమ వెంచర్ లోని 26 ప్లాట్లను 48 గంటల్లోనే రిజిస్ట్రేషన్ చేసిన ఈ సబ్ రిజిస్ట్రార్ అక్రమ వెంచర్ లలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే తన తర్వాతే ఎవరైనా అనే స్థాయిలో రిజిస్ట్రేషన్ లు చేస్తాడని కార్యాలయ సిబ్బంది,రియల్టర్ల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి…

ప్రసన్నం చేసుకుంటే చాలు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఐయిన ఒకే…

సబ్ రిజిస్ట్రార్ అవినీతి భాగోతాలు అన్నిఇన్ని కావు…

మరిన్ని అక్రమ రిజిస్ట్రేషన్లపై న్యూస్10 విశ్వసనీయ కథనం…మరో సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here