థాయిలాండ్ దేశంలోని నకోన్ సకోన్ ప్రాంతంలో అంతర్జాతీయ
ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యుత్ ఉద్యోగి సత్తా చాటాడు…జయశంకర్ భూపాలపల్లి జిల్లా టి ఎస్ ఎన్ పి డి సి ఎల్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇమ్మడి ప్రేమ్ కుమార్ అంతర్జాతీయ వేదికపై పోటీలో పాల్గొని మూడు బంగారు పతకాలు,ఓ సిల్వర్ మెడల్ సాధించి విద్యుత్ శాఖకు వన్నె తెచ్చాడు…ఈ నెల 22 ,25 తేదీల్లో నిర్వహించినసత్తా చాటిన విద్యుత్ ఉద్యోగి 28 వ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2024 లో జావలిన్ త్రో లో మూడు బంగారు పథకాలు, షార్ట్ ఫుట్ లో సిల్వర్ మెడల్ సాధించాడు…గతంలో కూడా విద్యుత్ శాఖ తరుపున అథ్లెటిక్స్ లో పాల్గొని ప్రేమ్ కుమార్ పలు పతకాలు సాధించాడు… హైదరాబాద్ లో నిర్వహించిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2023 లో జావలిన్ త్రో విభాగంలో రజత పతకం ,పోలో వాల్ట్ విభాగంలో బంగారు పతకం సాధించాడు…