హన్మకొండ నగరం నడిబొడ్డున శివాని జూనియర్ కళాశాల విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతుంది.2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపధ్యంలో శివాని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెబుతూ ,రంగురంగుల కరపత్రాలు చూపుతూ బురిడీ కొట్టిస్తూ వారిని బుట్టలో వేసుకుంటున్నారు.కాలేజీ యాజమాన్యాల మాటలు నమ్మి తమ విద్యార్థులను కళాశాలల్లో చేర్పిస్తూ వారు ఆర్ధికంగా నష్టపోతున్నారు.తమ పిల్లలకు కార్పొరేట్ స్థాయి ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్యను అందించాలని కలలు కానే తల్లిదండ్రులు ఆశలను పెట్టుబడిగా పెట్టుకుని విద్యను వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు శివాని విద్యా సంస్థల యజమానులు.నగరంలో ఐఐటీ, జేఈఈ లో ర్యాంకులు పొందిన మా విద్యార్థులు వీళ్ళే అంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తూ విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నారు.అర్హత ,అనుభవం లేని అధ్యాపకులతో విద్యా బోధన చేపిస్తూ ఆల్ ఇండియా ర్యాంకులు ఎలా సాధిస్తున్నారో అని నగరవాసులు చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే శివాని కళాశాలకు ప్రభుత్వ నిబంధనలతో మాకేం పని అన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఇంటర్మీడియట్ విద్యా శాఖ నుండి మూడు బ్రాంచీలకు మాత్రమే అనుమతి పొంది నగరంలో ఏడుకు పైగా బ్రాంచీలను నిర్వహిస్తూ యదేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు విద్యార్థి సంఘాల నుండి లేకపోలేవు.కనీస నిబంధనలు లేకుండా ఇరుకైన భవనాలను అద్దెకు తీసుకొని విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం ఆటు వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులే లక్ష్యంగా లక్షల్లో హాస్టల్ పీజులు వసూలు చేస్తూ అరకొర వసతులతో నాణ్యత లేని భోజనం పెడుతూ విద్యార్థుల అనారోగ్యానికి కారణమౌతున్నారు.ఆల్ ఇండియా ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేస్తూ వారి ఆత్మహత్యలకు కారణమౌతున్నారన్న ఆరోపణలు విద్యార్థి సంఘాల నాయకుల నుండి వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణ గత విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల సమయంలో సాహిత్య అనే విద్యార్థి కళాశాల భవనం పై నుండి ఆత్మహత్య చేసుకోవడమే అని విద్యార్థి నేతలు చెప్పుకొస్తున్నారు.విద్యా శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కనీస నిబంధనలు పాటించకుండా వందల సంఖ్యలో అడ్మిషన్లు చేస్తున్నా అధికారులు మాత్రం తమకేవి పట్టనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. భీమరం,బాలసముద్రం,ఎర్రగట్టుగుట్ట ప్రాంతాల్లో ఏసీ ,నాన్ ఏసీ క్యాంపస్ లు అంటూ ఆర్థికదోపిడికి పాల్పడుతున్నారు,హన్మకొండ నగరంలో శివాని కళాశాల ఆగడాలు ఇంతలా సాగుతుంటే అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి అండతోనే కళాశాల యాజమాన్యం రెచ్చిపోతున్నదన్న అనుమానం రాక మానదు,ఇకనైనా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి నిబంధనలు ఉల్లంఘిస్తున్న శివాని కళాశాల యాజమాన్యం మీద చర్యలు తీసుకోకపోతే వందలాది మంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేచి చూడాలి మరి విద్యాశాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో ….
శివాని జూనియర్ కాలేజీలో అడ్మిషన్ పొంది మోసపోవద్దు.
ఎల్తూరి సాయికుమార్.
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ..
హనుమకొండ నగరంలో శివాని జూనియర్ కాలేజీలు విద్యాశాఖ అనుమతులకు మించి అనేక బ్రాంచీలు నడిపిస్తూ అటు విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అదే విధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా నాణ్యమైన ఫుడ్ విద్యార్థులకు అందించడం లేరు విద్యార్థులెవ్వరు అనుమతిలేని విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొంది భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..
అధికారులు చర్యలు తీసుకోవాలి..
కేయూ బిఆర్ఎస్వీ నేత కొనుకటి ప్రశాంత్..
కనీస నిబంధనలు పాటించని శివాని విద్యా సంస్థలపై డీ ఐ ఈ ఓ చర్యలు తీసుకోవాలి.అధిక ఫీజుల వసూలును అరికట్టాలి.అనుమతికి మించి అడ్మిషన్లు చేస్తున్న విద్యా సంస్థలను వెంటనే మూసివేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి.ఐఐటీ జేఈఈ మెయిన్స్ పేర నగరంలో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అడ్డుకోవాలి.