వెంచర్ వారి ఇష్టమే…?

జాగా ఉంటే చాలు వెంచర్ పేరుతో పాగా వేస్తున్నారు కొందరు రియల్టర్లు… వెంచర్ వేసిందంటే చాలు అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు… ఎలాంటి అనుమతులు లేని వెంచర్ లో ప్లాట్లు కొని జనం తిప్పలు పడుతున్నారు…తమకు అన్ని అనుమతులు ఉన్నాయని అందమైన బ్రోచర్లు రంగురంగుల్లో ముద్రించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నట్లు ప్రచారం చేసుకుని జనాలకు ప్లాట్లు అంటగడుతున్నారు…

వంగపహాడ్ శివారులో…..

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామ శివారులో అక్రమంగా వెంచర్ దందా నడుస్తోంది… ఇక్కడ ఓ రియల్టర్ 801/బి లోని ఒక ఎకరం 29 గుంటల్లో వెంచర్ ఏర్పాటు చేసి అప్పుడే విక్రయాలు ప్రారంభించాడు….వ్యవసాయ భూమిలో ఈ వెంచర్ ను ఏర్పాటు చేసి కుడా అనుమతి లేకుండా వ్యవసాయ భూమిని కనీసం నాల కన్వర్షన్ చేయకుండా ఆ రియల్టర్ తన ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తూ అధికారులు తననేం చేయరన్నట్లు ప్రవర్తిస్తున్నాడు…..వ్యవసాయ భూమిలో నాన్ లే ఔట్ వెంచర్ ఏర్పాటు చేసి అనుమతులు లేని వెంచర్ కు అనుమతులు ఉన్నాయని కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు….ప్లాట్ కొనాలనుకున్న కొనుగోలుదారులు ఎవరైనా అనుమతుల గూర్చి పదే పదే ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే కొనండి లేదంటే వెళ్ళండి అంటూ ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నట్లు తెలిసింది… వెంచర్ గూర్చి ఫోన్ లో ఆరా తీయాలని చూసిన ఫోన్ లో ఎందుకు నేరుగా మా కార్యాలయానికి రండి అన్ని వివరాలు చెబుతాం అంటూ సమాదానం ఇస్తున్నారట…మరి ఈ అనుమతులు లేని వెంచర్ పై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here