వసూళ్లకు చెక్ పెట్టేదెవరు….?

ఆ అధికారి తన సామాజిక వర్గమే తనకు రక్ష అన్నట్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడట…తెలంగాణ సర్కార్ మొత్తం తనదే ఐయినట్లు ,ఆ సర్కార్ తో ఇంకెవరికి అసలు సంబంధమే లేనట్లు ఎంతగా వసూళ్లకు బరితెగించిన ఎంకాదనే ధీమాతో తన కిందిస్థాయి అధికారులతో విచ్చలవిడిగా వసూళ్లు చేయిస్తూ వసూళ్లు చేయడం అనేది అదేదో వారి హక్కు ఐయినట్లు వాహనదారులను వసూళ్లతో ముప్పుతిప్పలు పెట్టేస్తున్నాడట…. జనగామ జిల్లా రవాణశాఖ లో వసూళ్లకు పూర్తి సహకారం అందిస్తున్నది అక్కడి డి టి ఓ నేనని ఆరోపణలు సైతం జోరుగా వినవస్తున్నాయి….ఇక్కడి రవాణాశాఖ కార్యాలయంలో డి టి ఓ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి…..జనగామ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వసూళ్ల దందాపై గత రెండు రోజులుగా వస్తున్న వరుస కథనాలపై డి టి ఓ వక్ర భాష్యాలు చెబుతూ మనకేం కాదు అంతా అక్క చూసుకుంటుంది… అవసరమైయితే న్యూస్10 జర్నలిస్టుల పనిపడుతుందని డి టి ఓ తన చిల్లర మాటలతో మేకపోతు గాంబీర్యాన్నీ ప్రదర్శిస్తున్నాడట….

ఏసిబి అధికారులు ఓ కన్నేస్తార…?

జనగామ రవాణాశాఖ కార్యలయంలో డి టీ ఓ మొదలుకొని కింది స్థాయి అధికారులు,సిబ్బంది వరకు వాహనదారుల ముక్కుపిండి అక్రమంగా వసూళ్లు జరువుతున్న,ఇదంతా కార్యాలయంలో బహిరంగంగానే జరుగుతున్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది…. కాగా రవాణాశాఖ కార్యాలయంలో జరుగుతున్న వసూళ్ల భాగోతం పై ఏ సి బి అధికారులు ఓ కన్నేసి దాడులు జరిపి అక్రమ వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు….. ఈ అధికారుల అక్రమ ఆస్తులపై సైతం ఆరాతీసి అవినీతి సొమ్మును కక్కించాల్సిన అవసరం ఉందని….అధికారుల బరితెగింపు వసూళ్లకు చెక్ పెట్టాలని వాహనదారులు అంటున్నారు…

వసూళ్లను ప్రోత్సహిస్తుంది అతగాడే…?

వరంగల్ రవాణాశాఖ కార్యాలయంలో అక్రమ వసూళ్లను ప్రోత్సహిస్తున్నది జనగామ డి టి ఓ నేనని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి…. కార్యాలయంలో వసూళ్లను ప్రోత్సహిస్తూ సర్కార్ పెద్దలను బదనాం చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వచ్చిపడుతున్నాయి…వసూళ్లు చేయడం అసలు తప్పుకాదని…ఇంకా తక్కువగా వసూళ్లు చేస్తున్నారు పనికి ఇంత అని ఇంకా రేట్లు పెంచాలని తన కిందిస్థాయి అధికారులకు డిటిఓ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం…ఈ అధికారి ప్రవర్తన చూస్తుంటే అక్రమ వసూళ్లు చేయడం తన జన్మ హక్కని ఆయన వ్యహరిస్తున్నట్లు కనపడుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here