వర్ధన్నపేట కాంగ్రెస్ టికెట్ మాజీ పోలీసు అధికారి కె ఆర్ నాగరాజుకే దక్కేలా ఉంది….వర్ధన్నపేట లో కాంగ్రెస్ తరుపున బరిలో నిలవాలని నాగరాజు ఇటీవల ధరకాస్తు చేసుకోగా అధిష్టానం ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది…వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కే ఆర్ నాగరాజు కు దాదాపు ఖరారైనట్లేనని సమాచారం…మొన్నటివరకు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించిన కే ఆర్ నాగరాజు కు పోలీస్ శాఖలో మంచి పేరు ఉంది….పోలీస్ అధికారిగా ఇండియన్ పోలీస్ మెడల్ దక్కించుకున్న ఆయన ఎక్కడ పనిచేసిన ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న పోలీస్ అధికారిగా పేరుతెచ్చుకున్నారు…. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇప్పటికే కొంతమంది టికెట్ ఆశించి ధరకాస్తు చేసుకున్న కే ఆర్ నాగరాజు కు ఉన్న బలాబలాలు,నియజకవర్గం లో ఉన్న పరిచయాలను బేరీజు వేసుకుని తమ అభ్యర్థిగా ఆయనను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించబోతుందని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది…. పోలీస్ అధికారిగా పదవీ విరమణ పొంది కాంగ్రెస్ లో చేరినదగ్గరనుంచి కే ఆర్ నాగరాజు వర్ధన్నపేట నియోజకవర్గంలో కలియతిరుగుతూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారనే పేరు తెచ్చుకున్నారు….నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ ను మొత్తం దగ్గరకు తీసి సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన అనుచరులు చెపుతున్నారు…. అందరిని కలుపుకుపోతు వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ఆయన కృషిచేస్తున్నట్లు వారు తెలిపారు….నాగరాజును కలిసేందుకు నియోజకవర్గం లోని కాంగ్రెస్ క్యాడర్,యువత ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది…కాగా వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్ కే ఆర్ నాగరాజుకే ఖరారు అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో టికెట్ వస్తే తమ నాయకుడి గెలుపు ఖాయమని కే ఆర్ అనుచరులు అంటున్నారు….ప్రస్తుత ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత తమ గెలుపుకు పునాదిగా మారుతుందంటున్నారు…కే ఆర్ కు నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, పోలీస్ అధికారిగా ఉన్న మంచి పేరు తమకు అదనపు అర్హతలని కే ఆర్ శిబిరంలో ఉత్సహం కనపడుతుంది…మరోవైపు ఇప్పటివరకు బీజేపీ తమ అభ్యర్థి ఎవరో తేల్చకకపోవడంతో నియోజకవర్గంలో కేవలం ద్విముఖపోరే ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు….