వద్దిరాజు విందు రాజకీయం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కొక్కరికి టికెట్ పై ఆశలు బాగానే పెరుగుతున్నాయి…సిటింగ్ కు టికెట్ రాదని ,అధిష్టానం నో చెబుతోందని తెలిసిన కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు తమకు టికెట్ కావాలని తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు…అందులో గులాబీ పార్టీకి చెందిన నాయకులు ముందువరుసలో నిలుస్తున్నారు…తమకు టికెట్ రావడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఆయా నియోజకవర్గాల్లో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు…ఇప్పుడు అదే తరహాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తెగ ఉవిళ్లూరుతున్నట్లు తెలుస్తుంది…ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు అధిష్టానం టికెట్ నిరాకరిస్తే తాను ముందువరుసలో నిలిచి టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో ఆయన బాగ బిజిగా ఉన్నారట…రాష్ట్రంలోని పలు నియజకవర్గాల్లో అసంతృప్తులు కొందరు,టికెట్ ఆశిస్తున్న నాయకులు బాహాటంగానే అధిష్టానానికి విన్నపాలు చేస్తుండగా వద్దిరాజు రవిచంద్ర కు టికెట్ ఇవ్వాలని ఆయన సామాజిక వర్గం వారు సైతం సమావేశాలు నిర్వహిస్తూ గులాబీ అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారట….

విందు రాజకీయం….?
గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి సమయం లో కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో దిగి ఊహించిన దానికంటే ఎక్కువగానే పోటీ ఇచ్చిన వద్దిరాజు రవిచంద్ర వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది…ఇప్పటికే తనకు టికెట్ కావాలని అదిష్టానాన్ని సైతం కోరినట్లు తెలిసింది…ఈ నేపథ్యంలో వరంగల్ లోని ఓ హోటల్ లో వద్దిరాజు విందు రాజకీయం నడిపినట్లు తెలిసింది…గులాబీ పార్టీ నుంచి తనతో టచ్ లో ఉన్న కొంతమంది నాయకులు, కొందరు కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు ఈ విందులో పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం….తనకు గులాబీ నుంచి వరంగల్ తూర్పు టికెట్ వస్తుందని,బరిలో నిలిచేది తానేనని తనకు సహకరించాలని విందుకు హాజరయిన వారిని వద్దిరాజు కోరినట్లు తెలిసింది…మరోవైపు తూర్పు టికెట్ విషయంలో నన్నపనేని కి అధిష్టానం నో చెబుతుందని తూర్పు గులాబీలో జోరుగా ప్రచారం సాగుతుంది…టికెట్ విషయంలో నో చెప్పే వారి జాబితాలో నన్నపనేని పేరుందని చర్చ జరుగుతుంది…ఈ నేపథ్యంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విందు రాజకీయం పై సైతం చర్చ బాగానే సాగుతుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here