వందల కోట్ల మామూళ్లు….?

అక్రమ ప్రమోషన్ల డిటిసి ,”పాపా”లరాయుడు రవాణాశాఖలో కొనసాగించిన అవినీతి పనుల వల్ల రవాణాశాఖ లో కొంతమంది ఉద్యోగులు ఈ అక్రమాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందా…?అని ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొందట…. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర రవాణాశాఖ ను తన సామ్రాజ్యంగా మలుచుకొని గత ప్రభుత్వ పెద్దలు తనవారే ,తన సామాజికవర్గానికి చెందిన వారే అనే ధీమాతో వందల కోట్ల రూపాయలు మామూళ్లరూపంలో “పాపా”లరాయుడు దండుకున్నట్లు ఆరోపణలు బాగానే వినపడుతున్నాయి…ప్రభుత్వం మనదే,ప్రభుత్వ పెద్దలు మనవారే అని రవాణాశాఖలోని దాదాపు అందరు ఉద్యోగులను నమ్మించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రవాణాశాఖ కార్యాలయాలనుంచి కోట్ల రూపాయల మామూళ్లు నెల నెలా “పాపా”లరాయడు దండుకున్నట్లు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….. రాష్ట్రంలోని అన్ని జిల్లాల చెక్ పోస్టులు,ఆర్టిఏ కార్యాలయాలనుంచి తనకు సంబంధించిన,అలాగే గత ప్రభుత్వ పేరు చెప్పి తాను దగ్గర చేసుకొని తనతో ఉన్న అధికారుల ద్వారా బాగానే మామూళ్లు ఈ “పాపా”లరాయుడు దండుకున్నట్లు సమాచారం…..

బినామీలను గుర్తించే పని….?

రాష్ట్ర రవాణాశాఖలో సాధారణ ఉద్యోగిగా మొదలుపెట్టి అక్రమంగా ఒకే సంవత్సరంలో ఏకంగా మూడు ప్రమోషన్లు పొంది …తనతో పాటు మరో ఇద్దరికి ఇలాగే అక్రమ ప్రమోషన్లు ఇప్పించిన “పాపా”లరాయుడి అవినీతి చిట్టా సేకరించేందుకు రాష్ట్ర నిఘా సంస్థలు నజర్ వేసినట్లు తెలిసింది…..రాష్ట్ర వ్యాప్తంగా నెల నెలా తనకు వస్తున్న కోట్ల రూపాయలు, గత ప్రభుత్వం పేరు చెప్పి కూడబెట్టిన ఆస్తుల వివరాలు సేకరించే పని లో నిఘా సంస్థలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది….అంతేకాదు “పాపా”లరాయుడి బినామీలను సైతం గుర్తించే పనిలో నిఘా వర్గాలు ఉన్నట్లు రవాణాశాఖలో చర్చ సాగుతోంది….. గత కొద్దిరోజులుగా న్యూస్10 “పాపా”లరాయుడి అవినీతిపై వరుసకథనాలు వెలువరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖలో “పాపా”లరాయుడి వ్యవహారం చర్చానీయాంశంగా మారిందని తెలిసింది…న్యూస్10 కథనాలు ఆ శాఖలో చర్చ కు దారి తీయగా…కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అతగాడిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందా…. ?అని ఆశాఖ ఉద్యోగుల్లో చర్చ సాగుతుందట…మరోవైపు ఒకటి రెండు రోజుల్లోనే “పాపా”లరాయుడికి ప్రభుత్వం చెక్ పెట్టబోతుందని ఇప్పటికే అతగాడిపై చర్యలకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖలో ప్రచారం సాగుతోంది…..

వరంగల్ ఉమ్మడి జిల్లాలో పాపాల రాయుడి అవినీతి అనుచరులు….?

వామ్మో ఆ అధికారులు మహా ముదుర్లు…?

మరో సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here