రైసు మిల్లుల గండం…?

ఆ ప్రాంత ప్రజలకు మిల్లులు గండంగా మారాయి…ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి పరిసరాలను కాలుష్య కూపాలుగా మార్చుతున్నారు…మిల్లుల యజమానులు…కేవలం దనార్జనే ద్యేయంగా మిల్లులు నడుపుతూ కాలుష్య నియంత్రణ కు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా మిల్లు యజమానులు కాలుష్యం అయితే మాకేంటి….? అన్నట్లు ప్రవర్తిస్తున్నారు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…..

ఎందుకీ నిర్లక్ష్యం….?

హన్మకొండ జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అధికారుల నిర్లక్ష్యంతో రాంపూర్ కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లుల ద్వారా రాంపూర్ తోపాటు చుట్టు పక్కల గ్రామాలు కాలుష్య బారిన పడుతున్నప్పటికి ,కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం తమకేంపట్టనట్లు వ్యవహరిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది.హన్మకొండ జిల్లా కాజిపేట మండలం రాంపూర్ లో 8 పారాబాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి ఈ మిల్లులు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు విరుద్ధంగా కలుషిత నీరును శుద్ధి చేయకుండా స్థానికంగా ఉన్న కెనాల్ లోకి వదిలిపెడుతున్నారని న్యూస్-10 నిఘా టీం పరిశీలనలో తేలింది.ఇంత బహిరంగంగా కలుషితమైన నీరును నిబంధనలకు విరుద్ధంగా బయటికి పంపించినప్పటికి పొల్యూషన్ బోర్డ్ అధికారులు గమ్మునుండటం చూస్తుంటే అధికారులను మిల్లర్ లు ఏ స్థాయిలో ప్రసన్నం చేసుకున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు

కెనాల్ లో ప్రవహిస్తున్న కలుషిత నీరు…

సాధారణంగా కెనాల్ ల ద్వారా పంటపొలాలకు ప్రభుత్వం నీరు అందిస్తుంది. వ్యవసాయ భూములకు నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లరూపాయల నిధులను ఖర్చు చేసి కెనాల్ లను నిర్మించింది. ఆ కెనాల్ ల ద్వారా వ్యవసాయ భూములను నీరు అందిస్తుంది. కానీ రాంపూర్ మీదుగా పోయే కెనాల్ లో మాత్రం మంచి నీరు కాకుండా మురుగునీరు(కలుషిత నీరు)ప్రవహిస్తోంది.ఇక్కడ ఉన్న పారాబాయిల్డ్ మిల్లుల నుండి వచ్చే వ్యర్ధపు నీరు(కలుషిత నీరు) ఆ కెనాల్ లో కలిసి ప్రవహించడం బహిరంగంగా చూడొచ్చు. ఇంత యథేచ్ఛగా రైస్ మిల్లుల యజమానులు కలుషితనీరును కెనాల్ లోకి వదిలిపెడుతున్నారంటే మిల్లు యజమానులకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు మధ్య ఏ స్థాయిలో ఒప్పందం కుదిరిందో అని ప్రచారం జరుగుతోంది

నిబంధనలకు విరుద్ధం..

కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం పారాబాయిల్డ్ రైస్ మిల్లులో ఈ టి పి ప్లాంట్ ను ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేయాలి.ఇక్కడ ఉన్న మిల్లులో “ఈ టి పి ” ఉన్నప్పటికీ ఏ పారాబాయిల్డ్ రైస్ మిల్లులో కూడా అవి పనిచేయవు. ఈ మిల్లుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా పారాబాయిల్డ్ రైస్ మిల్లులు నిర్వహిస్తూ పొల్యూషన్ బోర్డ్ అధికారులను మేనేజ్ చేయడం వల్లే ఈ మిల్లులపై చర్యలు తీసుకోవడంలేదని బహిరంగంగా ప్రచారం జరుగుతోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here