పరకాల నియోజకవర్గంలో ఇద్దరు రెడ్డిల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది… సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న చల్లా ధర్మారెడ్డి,మొన్నటివరకు బీజేపీ లో కొనసాగి ఇటీవలే కాంగ్రెస్ లో చేరి పరకాల బరిలో నిలుస్తున్న రేవూరి ప్రకాష్ రెడ్డి లు పరకాల నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు… సిట్టింగ్ ఎమ్మెల్యే గా బి ఆర్ ఎస్ నుంచి మళ్ళీ టికెట్ దక్కించుకుని మరోసారి విజయం సాధించాలని చూస్తున్న చల్లా ధర్మారెడ్డి తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తున్నారు….ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ గతంలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఇనగాల వెంకట్రామిరెడ్డి కే టికెట్ వస్తుందని అందరు భావించిన కమలం పార్టీ వదిలి హస్తం అందుకున్న రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ రావడం ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి…ఇప్పుడు ఇద్దరు రెడ్డిల మధ్య జరగబోతున్స పోరు రసవత్తరంగా మారనుంది….
రేవూరికి సహాకారం అందేనా….?
మొన్నటివరకు నర్సంపేట బిజేపి అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీలో ఉంటారని అందరూ భావించారు కానీ రేవంత్ రెడ్డి తో తనకున్న పరిచయంతో పరకాల టికెట్ హామీ తీసుకున్న రేవూరి ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీలో చేరి చేరిన కొద్దిరోజులకే పరకాల కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు… టికెట్ రావడంతో రేవూరి కాసింత సంతృప్తి చెందిన అసలు పరకాల నియోజకవర్గం లోని కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు సహకరిస్తార…లేదా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది….ఇటీవలే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం వల్ల నియోజకవర్గంలోని నాయకులతో,కార్యకర్తలతో ఆయనకు అంతగా సంబంధాలు లేవనే ప్రచారం జరుగుతోంది… మరోవైపు రేవూరి స్వగ్రామం తనకు పరిచయాలు ఉన్న గ్రామాలు కొన్ని ఆత్మకూరు మండలంలో ఉండడం ఆయనకు కొంతమేర పరిచయాలు ఉన్న ఇటీవలే కాంగ్రెస్ లో చేరి కొద్దీ రోజులకే టికెట్ పొందడం తో ఇన్ని సంవత్సరాలుగా పరకాల నియోజకవర్గంలో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది….ఇదిలాఉంటే పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇంచార్జి ఇనగాల వెంకట్రామిరెడ్డి కలత చెందినట్లు సమాచారం…టికెట్ రాకపోవడంతో అవసరమైతే నియోజకవర్గంలో రేవూరికి సహాయ నిరాకరణ లేదంటే పార్టీ నుంచే తప్పుకునే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్లు సమాచారం….మరోవైపు నియోజకవర్గం లోని కొంతమంది ఇనగాల అనుచరులు సైతం తమ నాయకునికి టికెట్ రాకపోవడంతో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది….ఇన్నిరోజులు నియోజకవర్గంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకొని ఉన్న వారిని కాదని ప్యారచూట్ నాయకులకు టికెట్ ఎలా ఇస్తారని కొందరు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నారు…దింతో వీరినుంచి రేవూరి కి ఎలాంటి సహకారం అందదనే సంకేతాలు వెలువడుతున్నాయి….కాగా పరకాల నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు బరిలో నిలవడంతో ఈ నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గ ఓట్లు ఎవరికి పడతాయనే ప్రశ్న తలెత్తుతుంది… సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న చల్లా ధర్మారెడ్డి వైపు వారు అధికశాతం మొగ్గు చూపుతారని కొందరు అంటుండగా రేవూరి సైతం రెడ్డి సామాజికవర్గం ఓట్లను తనవైపు తిప్పుకుంటారని కొందరు అంటున్నారు…. కాగా ఈ నియోజకవర్గం లో బిసి ల ఓట్లు అధికంగా ఉండడంతో బీజేపీ ఎవరిని తమ అభ్యర్థిగా బరిలో నిలుపుతుందో ఇంకా ఎటూ తేలలేదు…బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే ఇక్కడ పోరు త్రిముఖమా లేక బహుముఖమా అనేది తేలనుంది…..