రేవంత్ పాటకు స్టెప్పులేయించిన టీచర్లు

జగిత్యాల ఆసుపత్రిలో విధులు మరిచి వైద్య సిబ్బంది క్రిస్మస్ వేడుకలతో నృత్యాలు చేయగా ,అదే జిల్లాలో కొంతమంది ఉపాద్యాయులు రేవంత్ రెడ్డి పాటకు విద్యార్థినులతో డాన్సులు వేయించారు…అన్న రేవంతు అనే పాటకు విద్యార్థినులచేత స్టెప్పులు వేయించారు… ఈ నృత్య ప్రదర్శన
జగిత్యాల మండలం లక్ష్మీపూర్ బీసీ వెల్ఫెర్ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది…రేవంత్ రెడ్డి పాటకు విద్యార్థినులతో టీచర్లు డ్యాన్సులు వేయించగా,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డా.సంజయ్ హాజరయ్యారు… అంతే కాదు ఎమ్మెల్యే మెప్పుకోసం కావచ్చు అక్కడ ఉన్న టీచర్లు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ..సంజయ్ అన్న సూపర్ స్టార్ అంటూ ఏకంగా విద్యార్థినుల చేత నినాదాలు చేయించారు….కాగా రేవంత్ రెడ్డి పాటకు విద్యార్థినులు డాన్సులు చేస్తుంటే ఆశ్చర్యం వ్యక్తం చేయడం తల్లిదండ్రుల వంతయ్యింది…

రేవంత్ పాటకు స్టెప్పులేస్తున్న విద్యార్థిని లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here