రాంపూర్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లో ఆ మూడు పార బాయిల్డ్ మిల్లుల ఇష్టారాజ్యం నడుస్తుంది…ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోకుండా వాటికి ఇష్టారీతిన గండి కొట్టడం వారికి అలవాటుగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి….మిల్లుల్లో వ్యర్థాల శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయకుండానే మిల్లులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది… కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పక్కనపెట్టి ఈ మూడు మిల్లుల యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తుండగా అంతా నేను చూసుకుంట అంటూ ధాన్యం కాంట్రాక్టర్ నుంచి మిల్లర్ గా అవతారం ఎత్తిన ఓ వ్యక్తి భరోసా ఇస్తున్నట్లు తెలిసింది….ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ఈ మూడు మిల్లులో ఓ మిల్లు ఇతగాడిది కాగా ఈ మిల్లు నుంచి కలుషిత నీరు పెద్దఎత్తున బయటకు వదులుతున్నారు….ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కలుషిత నీరు బయటకు వదలడం వల్ల ఆ ప్రాంతం మొత్తం కంపు కొడుతోంది… దుర్గందం తో ముక్కుపుటాలు అదిరి పోతున్నాయి…..
అవును రూటు మార్చారు
మొన్నటి వరకు పార బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి వచ్చే కలుషిత నీటిని ఆ మూడు మిల్లుల యజమానులు సమీపంలోనే ఉన్న దేవాదుల కెనాల్ లోకి వదిలారు… దింతో ఆ కెనాల్ లో కలుషిత నీరు నురగలు కక్కుతూ ఆ ప్రాంతం మొత్తం కంపు కొట్టింది….దేవాదుల కెనాల్ లో ఆ మూడు మిల్లులు కలుషిత నీటిని వదులుతున్న వైనాన్ని న్యూస్10 వెలుగులోకి తెచ్చింది…దింతో స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి ,దేవాదుల అధికారులు కలుషిత నీటిని బయటకు వదలొద్దని ఆదేశాలు జారీచేసారు…అలాగే దేవాదుల కెనాల్ లోకి కలుషిత నీరు వెళ్లకుండా సిమెంట్ తో అడ్డుకట్ట వేసేందుకు ప్లాస్టరింగ్ చేశారు…ఇక దేవాదుల కెనాల్ లోకి కలుషిత నీరు వదిలే చాన్స్ లేకపోవడంతో ఆ మూడు మిల్లుల యజమానులు రూట్ మార్చారు…కలుషిత నీటిని కాలువ ద్వారా నేరుగా మడికొండ చెరువులోకి వదులుతున్నారు…ఇండస్ట్రియల్ ఎస్టేట్ కు దాదాపు అర కిలోమీటర్ పైగానే దూరం ఉండే ఈ చెరువులోకి గుట్టుచప్పుడు కాకుండా ఈ మూడు మిల్లుల యజమానులు కలుషిత నీటిని వదులుతున్నారు….దింతో కలుషిత నీరు వల్ల చెరువు నీరు కొద్దికొద్దిగా కలుషితం అవుతుంది….
అధికారులు దృష్టి సారించాలి….
కలుషిత నీటిని చెరువులోకి వదులుతున్న ఆ మూడు మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు….మొన్నటివరకు దేవాదుల కాలువలోకి కలుషిత నీటిని వదిలి కాలుష్యానికి కారణం మయిన మిల్లు యాజమాన్యాలు ఇప్పుడు చెరువునీటిని కలుషితం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు…మరి ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు,నీటిపారుదల శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి