హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఓ లేడి డాన్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి….రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని వివాహా రిజిస్ట్రేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆ మహిళ ఉద్యోగి తోటి ఉద్యోగుల పట్ల ఇష్టారీతిన ప్రవర్తిస్తూ అకారణంగాదుర్బాషలాడుతున్నట్లు తెలియవచ్చింది…..పై అధికారులు ఎవరు చెప్పిన వినని ఈ లేడి డాన్ ఎవరు నచ్చజెప్పిన బండబూతులు తిడుతున్నట్లు తెలిసింది….
చెపితే విని తీరాల్సిందే…..
హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ లేడి డాన్ తాను పనిచేస్తున్న సెక్షన్ లో ఆమె మాటే శాసనంగా చెల్లుబాటు కావాలట….తాను చెప్పిందంటే చాలు ఎవరైనా విని తీరాల్సిందే నట…ఇటీవల ఓ తోటి ఉద్యోగి తో అకారణంగా గొడవకుదిగి ఇష్టమున్నట్లు దుర్బాషలాడినట్లు తెలియవచ్చింది….దింతో రిజిస్ట్రేషన్ కార్యాలయం లోని అధికారులు కలుగజేసుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే తన పై అధికారిని సైతం ఇష్టారీతిన దుర్బాషలాడి తన దురుసుతనాన్ని ప్రవర్తించిందట….తోటి ఉద్యోగిని దుర్బాషలాడి కార్యాలయంలో వీరంగం ఆడిన ఈ లేడి డాన్ కార్యాలయంలో సెక్షన్ మార్చిన ఆ లేడి ఉద్యోగికి అసలే నచ్చలేదట…తాను సెక్షన్ మారే ప్రసక్తే లేదని కార్యాలయంలోని పై అధికారిపై ఇష్టం ఉన్నట్లు తిట్ల పురాణం అందుకుందట …తాను సెక్షన్ మారేది లేదని తెగేసి చెప్పిందట….
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బయటి వ్యక్తులు….
రిజిస్ట్రేషన్ కార్యలయంలో తోటి ఉద్యోగులను ఇష్టారీతిన దుర్బాషలాడుతూ గొడవలకు దిగుతున్న లేడీడాన్ కార్యాలయంలో తనను ఎవరో తిట్టినట్లు సీన్ క్రియేట్ చేసి బయటి వ్యక్తులను కార్యాలయంలోకి తీసుకువచ్చి ఇటీవల పంచాయతి పెట్టినట్లు తెలిసింది…వారితో కార్యాలయంలోని ఉద్యోగులను బెదిరించినట్లు తెలిసింది….రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సెక్షన్ లోకి ప్రవేశించిన బయటి వ్యక్తులు సైతం కార్యాలయంలో తమ ఇష్టారీతిన వ్యవహరించినట్లు సమాచారం… కాగా లేడి డాన్ గొడవలతో విసిగిపోయిన ఉద్యోగులు లేడి డాన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారట…. మరి ఈ లేడి డాన్ విషయంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి…