రాసిపెట్టుకో కాంగ్రెస్…

కాంగ్రెస్… రాసి పెట్టుకో నాకు 60 వేలకు పైగా మెజారిటీ వస్తుంది..ఇది ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ ఊరూరా తిరుగుతూ అపూర్వ ఆదరణ కూడగట్టుకుంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా…
మీరు పాలకుర్తికి ప్రజా సేవ కోసం వచ్చారా లేక రాజకీయ లబ్ధి కోసం వచ్చారా..? అంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తీరు ను ఎండగడుతూ కదులుతున్న దయన్న ఎన్నికల ప్రచారంలో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు….

దయన్న గా తనను పాలకుర్తి ప్రజల గుండెల్లో ఉంచుకుంటారని తనను,కేసీఆర్ ను , బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఈసారి కూడా ప్రజలు ఖచ్చితంగా కాపాడుకుంటారని ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలపట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు….రాయపర్తి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు మండలంలోని వివిధ గ్రామాల్లో భారీ జన సందోహం మధ్య విస్తృతంగా పర్యటించారు….వందల సంఖ్యలో బైక్ లతో ఊరురా ర్యాలీలు, బతుకమ్మలు, కోలాటలు,డప్పు వాయిద్యాలు,గాల్లో డ్రోన్లతో పూలు జల్లుతూ అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కొనసాగింది…
ఈ సందర్బంగా మంత్రి దయాకర్ రావు రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ..ఓటు తప్పుడు వాళ్లకు వేస్తే మన భవిష్యత్తు,మన పిల్లల భవిష్యత్ ఆగమవుతుందని కష్ట కాలాల్లో మి వెంటే ఉండి మీ గ్రామానికి ,మీ జీవితాలకు వెలుగు తెచ్చి ,ఆన్ని విధాల అభివృధ్ది చేసిన బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు..గత ఎన్నికల్లో తాను యాబై వేల మెజారిటీ అడిగితే ప్రజలు తనకు యాభై నాలుగు వేలకు పైగా మెజారిటీ ఇచ్చారని, ఈసారి కూడా అంతకంటే ఎక్కువగా మెజారిటీతో తనను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలే గెలిపించుకుంటారని,ఈ విషయం కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు..
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గురించి ఆయన మాట్లాడుతూ, పాలకుర్తి ప్రజలు వారిని నమ్మట్లేదు కాబట్టే,ఊరురా బ్రోకర్ల లాంటి నాయకులని డబ్బులతో కొని మంచి వారమని చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారని వారు ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే వారు రాజకీయాలకు వస్తున్నారు తప్ప ,ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో కాదు అన్నారు..అదే తనైతే 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నా, వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా…ఏ ఒక్క అవినీతి మచ్చ తన పై లేదని ఈ విషయం ప్రజలకు తెలుసు కాబట్టి తన ప్రచారానికి తండోప తండాలుగా ప్రజల తరలివస్తున్నారని ఆయన తెలిపారు…కొన్ని కొన్ని సార్లు వాళ్ళే నియోజకవర్గ లో జరిగిన అభివృద్ధి చూసి జై కేసీఆర్ ,జై దయాకర్ రావు అంటున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రసారమేయ్యే వీడియోలను ఆయన ఉదహరించారు.సీఎం.కెసీఆర్ మనకెన్నో పథకాలను అభివృద్ధి పథకాలను తీసుకువచ్చి తద్వారా రాష్ట్రానికి ఎంతో మంచి చేశారని వాటిలో కొన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చి ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా ఇచ్చాయని… అంతేకాక వాటిని దేశమంతటా పేర్లు మార్చి అమలుపరుస్తున్నాయని,అలాంటి కెసిఆర్ కాపాడుకోవాలంటే కచ్చితంగా బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకు తీసుకురావాలి ఆని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు…
ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు,స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here