రవాణాశాఖలో పాపాలకు చెక్ పడేనా…..?

కొత్త ప్రభుత్వం వచ్చింది… అన్ని శాఖల పై సమీక్ష నిర్వహిస్తుంది…ఆయా శాఖల్లో ఉన్న అనుకూలతలు ప్రతికూలతలపై చర్చ జరుగుతుంది… అంతేకాదు ఏ శాఖ ఎంత లోటులో ఉంది …ఎంత అప్పుల్లో కూరుకుపోయి ఉంది అనే అంశంపై సైతం చర్చ సాగుతోంది…ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ పై సమీక్ష జరగగా కోట్లల్లో అప్పులు ఉన్నట్లు తేలిందని ఆ శాఖ మంత్రే స్వయంగా చెబుతున్నారు…ఈ విషయం అటుంచితే ఇప్పుడు దృష్టి రవాణా శాఖ పై ఎప్పుడు పెడతారా ….అని అందరూ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది…రవాణాశాఖ లో కీలకమైన ఆర్ టి ఎ పై కొత్త సర్కార్ దృష్టి పెడితే ఓ “పాపా”ల పుట్ట పలగడం ఖాయమని ఆ శాఖ ఉద్యోగులు అనుకుంటున్నారట…అంతే కాదు పాపాల పుట్ట ఎప్పుడు పలుగుతుంది…? అని సోషల్ మీడియాలో ఆశాఖలో పనిచేస్తున్న కొందరు పోస్టింగులతో ప్రశ్నిస్తున్నారట…ఇక నీవంతే అంటూ ఆ పాపాల పుట్టకు వార్నింగ్ ఇస్తున్నారట….

ఎవరీ “పాపా”ల పుట్ట…..?

ఆర్ టి ఏ లో సాధారణ ఉద్యోగిగా తన కొలువు మొదలుపెట్టి …తనకన్నా సీనియర్ గా ఉన్న ఉద్యోగులను దాటి అడ్డదారిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రమోషన్ లు కొట్టి ఇప్పుడు ఆ పాపాలపుట్ట అధికారి డి టి సి గా కొలువు వెలగ బెడుతున్నాడట….రవాణా శాఖలో ఉన్నతాధికారులకన్న ఇతని మాటకే పవర్ ఎక్కువ వాల్యూ కూడా ఎక్కువేనట…ఎం పని జరగాలన్న ఇతగాడిని పట్టుకుంటే ఇట్టే అయిపోతుందట… ఉత్త పుణ్యానికి పని అయిపోతుంది అనుకుంటే మీరు తప్పులో కాలు వేసినట్లే అలా కాదట ప్రమోషన్ కు ఇంత,బదిలీ కి ఇంత ఇతర పనులకు ఇంత ఇంత అంటూ ఓ రేటు కార్డు ఉంటుందట ఈ అధికారి పాపాలరావు గారి దగ్గర…ఇలా చేసి చేసి గత దశాబ్ద కాలంలో వందల కోట్లకు ఈ సాధారణ ఆర్ టి ఏ ఉద్యోగి ఎదిగాడట…కొందరైతే వందలకోట్లు కాదు వేల కోట్లు సంపాదించాడని వందల కొద్దీ ఉదాహారణలు చెబుతున్నారు…. అంతేకాదు రవాణాశాఖ యూనియన్ ముసుగులో సైతం ఈ అధికారి బాగానే వెనికేశాడనే ప్రచారం ఆర్ టి ఎ లో బాగానే జరుగుతుంది…..

ఎవరీ పాపా రాయుడు ఏమాకథ

రేపటి సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here