తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖలో అక్రమంగా ప్రమోషన్ లు పొంది ఉపరవాణా కమిషనర్ లుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులపై న్యూస్-10 వరుస కథనాలను ప్రచురించింది. సంబంధిత కథనాలపై స్పందించిన రవాణాశాఖ ఆ ముగ్గురు డిటిసి లపై, విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ముగ్గురు ఉపరవాణా కమిషనర్ లు ప్రమోషన్ ఏ ప్రాతిపదికన పొందారు,వీరి అర్హతలు ఏంటి ? గత ప్రభుత్వం ఏ జీవో ప్రకారం ఈ ముగ్గురికి ప్రమోషన్ లు ఇచ్చింది అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.ఈ ముగ్గురు డిటిసిల అక్రమ ప్రమోషన్ ల వ్యవహారం పై ప్రభుత్వం అత్యంత రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ అధికారిగా ఇదే శాఖకు చెందిన జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ను ప్రభుత్వం నియమించినట్లు తెలిసింది.అక్రమ ప్రమోషన్ విచారణ వేగవంతం కాకుండా ఉండేందుకు ఇప్పటికే అక్రమంగా ప్రమోషన్ పొందిన తమ్ముడు శీను ప్రయత్నాలు మొదలెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే రవాణాశాఖలో బదిలీలు జరుగనున్న సమాచారం ముందుగానే అందుకున్న తమ్ముడు శీను రవాణా కమిషనర్ కార్యాలయానికి దగ్గరగా ఉండే పోస్టింగ్ ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని రవాణాశాఖలో ప్రచారం జరుగుతోంది