మొన్న అక్కడ…నేడు ఇక్కడ వ్రిద్ది కంపెనీ ఇష్టారాజ్యం

రహదారి నిర్మాణం పేరుతో వ్రిద్ది కంపెనీ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…ప్రభుత్వ పని అంటూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘన చేస్తూ అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ లక్షల రూపాయలు విలువచేసే మట్టిని అప్పనంగా తవ్వుతూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు…మైనింగ్ అధికారులవద్ద నుంచి టి పి తాత్కాలిక అనుమతుల పేరుతో ఎన్నో కొన్ని క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకొని తమకు తోచినవిదంగా మట్టి తవ్వుతూ మట్టి చౌర్యానికి ఈ కంపెనీ పాల్పడుతుందని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు…

మొన్న అక్కడ….

హన్మకొండ నుంచి భూపాలపట్నం వరకు నిర్మితమవుతున్న నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కోసం కావాల్సిన మట్టి కోసం హన్మకొండ జిల్లా దామెర మండలం వెంకటాపురం శివారులో వ్రిద్ది కంపెనీ భారీ తవ్వకాలు జరిపి వేల టన్నుల మొరాన్ని రోడ్డు నిర్మాణం కోసం అప్పనంగా తరలించుకుపోయినట్లు తీవ్ర ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి తీసుకున్న అనుమతికి తవ్వకానికి ఏమాత్రం పొంతన లేకుండా వారికి తోచినన్ని క్యూబిక్ మీటర్లు తవ్వేసినట్లు తెలిసింది….ఈ తవ్వకాల నేపథ్యంలో వ్యతిరేకత వ్యక్తం కాగానే అక్కడనుంచి మకాం మార్చి కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఆత్మకూరు మండలం కటాక్షపురం చెరువులో తిరిగి తమ అడ్డగోలు మట్టి తవ్వకానికి వ్రిద్ది కంపెనీ తెరతీసినట్లు తెలిసింది…మట్టి తవ్వకం కోసం అనుమతులు ఇవ్వాల్సిన మైనింగ్ అధికారులు సైతం ఈ కంపెనీ అడుగులకు మడుగులొత్తుతూ సహకరిస్తుండడం ఎంతగా మట్టి తవ్విన తమకేం పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది…. తమను అడిగేవారు లేరు…ప్రభుత్వ పని చేస్తున్నాం కనుక తమను ఆపే దమ్ము ఎవరికి లేదని వ్రిద్ది కంపెనీ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని తెలుస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here