మెడ్ హెల్త్ పై చర్యలెప్పుడు….?

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మెడ్ హెల్త్ హాస్పిటల్ పై చర్యలకు టౌన్ ప్లానింగ్ అధికారులు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ శాఖ అనుమతులను ఉల్లంఘిస్తూ అదనపు అంతస్తు నిర్మించడమే కాకుండా ఎలాంటి సెట్ బ్యాక్ ,డివియేషన్ లేకుండా రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ భవనాన్ని నిర్మించి మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి కొట్టిన సదరు కార్పొరేట్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడానికి అధికారులకు చేతులు రావడం లేదు.భవన నిర్మాణం పూర్తి అయి నెలలు గడుస్తున్నా అది పూర్తిగా మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా టౌన్ ప్లానింగ్ అధికారుల్లో ఏమాత్రం చలనం లేదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.మెడ్ హెల్త్ హాస్పిటల్ నిర్మాణంలో మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘిన్చిందని  న్యూస్ 10 గుర్తించి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు చర్యలకు పునుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.పైగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులే కార్పొరేట్ యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హాస్పిటల్ నిర్వాహకులు ఓ బీ ఆర్ ఎస్ కార్పొరేటర్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో అధికారులు కూడా చర్యలకు జంకుతున్నట్లు సమాచారం.పైగా సదరు కార్పొరేటరే అధికారుల చర్యలను కూడా నిలువరిస్తున్నారన్న చర్చ జోరుగా నడుస్తోంది.ఒకటి రెండు రోజుల్లో అక్రమ నిర్మాణానికి నోటీసులు ఇస్తాం అంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని అందుకు హాస్పిటల్ యాజమాన్యం అధికారులను వారిని ప్రసన్నం చేసుకోవడమే అన్న అనుమానం రాక మానదు.నిలువ నీడ లేక ఉన్న కొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే సామాన్యుల విషయంలో ఒకటి రెండు రోజుల్లోనే నోటీసులు లేకుండా కూల్చివేతలకు పాల్పడే అధికారులు మరి కార్పొరేట్ భవంతులు విషయంలో ఎందుకు అలా వ్యవహించడం లేదో వారికే తెలియాలి.నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మించిన తమ భవనాన్ని ఏ అధికారి ఎం చేయవద్దంటు స్థానిక ఎమ్మెల్యే, నగర మేయర్ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించడం వెనుక అసలు మర్మమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు..వేచి చూడాలి మరి అధికారులు మెడ్ హెల్త్ హాస్పిటల్ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here