తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు…చేవెళ్ల లో నిర్వహించిన బీజేపీ సభలో మాట్లాడిన ఆయన కేసీఆర్,మజ్లీస్ పై విరుచుకుపడ్డారు… తెలంగాణలో కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని తమకు మాత్రం మజ్లీస్ అంటే ఏమాత్రం భయం లేదన్నారు….తెలంగాణ సర్కార్ మజ్లీస్ ఆడించినట్లు ఆడుతుందని ,ఎస్సి,ఎస్టీ,ఓ బిసి లకు న్యాయం చేస్తూ అధికారం లోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల ను రద్దు చేస్తామని అన్నారు….కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నాడని అది సాధ్యం కాదని మళ్ళీ కాబోయే ప్రధాని మోదీయే అని అమిత్ షా అన్నారు…