మిల్లులను గాలికొదిలేశారు…!

హన్మకొండ జిల్లా రాంపూర్ ఇండస్టియల్ ఎస్టేట్ లోని పార బాయిల్డ్ రైస్ మిల్లులను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గాలికొదిలేశారు… ఈ మిల్లుల వల్ల మడికొండ చెరువు జలాలు కలుషితం అవుతున్నాయని….ఈ మిల్లులనుంచి బయటకు వస్తున్న కలుషిత జలాలు కాలువ ద్వారా నేరుగా చెరువులో కలుస్తున్నాయని తెలిసిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమకేం అవసరం అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…..ఈ మిల్లుల కాలుష్యం పై గత కొద్దిరోజులుగా న్యూస్10 దినపత్రికలో కథనాలు వెలువరించగా పై అధికారులకు నివేదిక పంపాము పక్షం రోజుల్లో నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం అని చెప్పిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఏమాత్రం స్పందన లేకుండా ఉన్నారు…నివేదిక విషయంలో చర్యల విషయంలో ఎక్కడ లేని గోప్యాన్ని ప్రదర్శిస్తున్నారు…అసలు కాలుష్య నియంత్రణ మండలి పై అధికారుల కు ఎం నివేదిక పంపారో చెప్పడానికి సైతం అధికారులు నిరాకరిస్తున్నారు…మా ఇష్టం ఏ నివేదిక ఐయిన పంపిస్తాం మీకెందుకు….?అన్నట్లు వివరణ ఆడిగిన సమాదానం చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది…అసలు కాలుష్యానికి కారణం అవుతున్న ఈ మిల్లులపై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఆ మిల్లు యాజమాన్యాలు వెనకేసుకొస్తున్నారో… వారికే తెలియాలి….

ఆ నీటిని టెస్ట్ చేయండి….

రాంనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి వస్తున్న కలుషిత నీటిని టెస్ట్ చేయాలని ఇరిగేషన్ అధికారులు చెప్పిన కాలుష్య నియంత్రణ మండలి అధికారుల చెవికి ఏమాత్రం ఎక్కడం లేదు….పరీక్ష చేయాలని ఇరిగేషన్ అధికారులు అడిగితే గతంలోనే చేసాం అని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమాధానం ఇవ్వగా మళ్ళీ చేయాలని ఇరిగేషన్ అధికారులు అడిగితే చేస్తాం…చేస్తాం అంటూ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తుంది…ఐ బి అధికారులు కలుషిత నీటిని పరీక్ష చేయమని దాదాపు నెల రోజులు గడుస్తున్న ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కనీస స్పందన లేకుండా వ్యవహరించడం వెనకాల మతలబు ఏంటో కాలుష్య నియంత్రణ మండలి అధికారులకే తెలియాలి….కాగా రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న పార బాయిల్డ్ రైస్ మిల్లులకు కాలుష్య నియంత్రణ మండలి లో ఉన్న ఓ అధికారి సహకారం అందిస్తన్నట్లు తెలుస్తుంది…కాలుష్య నియంత్రణ మండలి కి సంబంధించిన అనుమతులు ఇప్పించె ఓ ఏజెంట్ ఇందుకు పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు వీరి పైరవీ వల్లే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here