మిల్లర్ల తో మిలాఖత్….?

హన్మకొండ జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమ ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి…. నిబంధనలు పాటించకుండా కాలుష్యానికి కారణం అవుతున్న పారబాయిల్డ్ రైస్ మిల్లులపై ఏమాత్రం చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని స్థానికులు అంటున్నారు… ఎన్ని సార్లు పిర్యాదు చేసిన కనీసం పట్టించుకోవడం లేదన్నారు….

మిల్లర్ల తో మిలాఖత్……?

హన్మకొండ జిల్లా రాంపూర్ లో ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లర్ ల యాజమాన్యం తో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు మిలాఖత్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది .ఆ మిల్లర్ లతో అధికారులు రహస్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే ఆ మిల్లుల నుండి కలుషిత నీరు బయటికొచ్చినా కూడా చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాంపూర్ లో ఎనిమిది పారాబాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి ఆ మిల్లుల్లో నిబంధనల ప్రకారం” ఈ టీ పి” ప్లాంట్ లు ఉన్నప్పటికీ ఏ మిల్లులో కూడా అవి పనిచేయవని విశ్వసనీయ సమాచారం.ఆ మిల్లుల్లో “ఈ టి పి” ప్లాంట్ లు పనిచేయకపోవడం వల్లే మిల్లర్ ల యాజమాన్యం ఆ వ్యర్ధపు నీటిని మిల్లుల్లో నుండి పైపులు, కాల్వల ద్వారా కెనాల్ లోకి వదిలేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.ఇక్కడ ఉన్న శ్రీనివాస ఇండస్ట్రీస్, మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్, సూర్యతేజ ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్, వినాయక ఇండస్ట్రీస్, సూర్య ఇండస్ట్రీస్ రామాంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీ ధనలక్ష్మి ఇండస్ట్రీస్ ఎనిమిది పారాబాయిల్డ్ మిల్లుల్లో “ఈ టి పి” ప్లాంట్ లు పనిచేయట్లేదనే విషయం కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు తెలిసినా, ఆ మిల్లుల నుండి వ్యర్ధపు నీరు బయటికొచ్చి కెనాల్ లో కలుస్తున్నా.. మిల్లర్ లతో జరిగిన చీకటి ఒప్పందం వల్లే పొల్యూషన్ బోర్డ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విశ్వసనీయ సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here