నగరం నడి బొడ్డున నక్కలగుట్ట కేంద్రంగా విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వైబ్రాంట్ అకాడమీ ఎక్కడలేని బరితెగింపుతనం ప్రదర్శిస్తుంది.నగరం మొత్తం భారీ హోర్డింగులు,కటౌట్లు కట్టి ప్రత్యేకంగా పీ ఆర్ వో లను నియమించుకొని వారికి ప్రతి అడ్మిషన్ పై కమిషన్ ఇస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టించి బుట్టలో వేసుకునేందుకు బాగానే ప్రయత్నిస్తుంది.వైబ్రాంట్ అకాడమీ కి ఎలాంటి అనుమతులు లేకున్నా ఇప్పటికే చాపకింద నీరులా తమ అడ్మిషన్ల ప్రక్రియను షురూ చేసింది.ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని లక్షల్లో ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.రంగు రంగుల బ్రోచర్లతో విద్యార్థులను,వారి తల్లిదండ్రులను కార్పొరేట్ విద్య పేరుతో వారి మాయలో పడేసుకొని నిలువు దోపిడీ చేసేందుకు సిద్ధంగా ఉందనేది విద్యార్థి నాయకుల నుండి వస్తున్న ప్రధాన ఆరోపణ..అయితే ఇదిలా ఉంటె గత రెండు రోజుల క్రితం న్యూస్ 10 వెలువరించిన “వైబ్రాంట్ వింత పోకడ” కథనంతో అకాడమీ పాల్పడుతున్న అక్రమాలను పత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.అయితే అకాడమీకి అన్ని అనుమతులు ఉన్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ న్యూస్ 10 పరిశీలనలో మాత్రం ఎలాంటి అనుమతులు లేవని తేలింది.ఈ క్రమంలో ఏబీ ఎస్ ఎఫ్,బీ ఏస్ ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు అకాడమీ నిర్వహణ తీరుపై మండిపడ్డారు.పీ ఆర్ ఓ ల సహాయంతో వందల సంఖ్యలో అడ్మిషన్ల చేస్తున్న అకాడమీ వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు.అకాడమీ కి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ వైబ్రాంట్ విద్యా సంస్థను మూసివేయాలని ,నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను డిమాండ్ చేశారు.విద్యార్థి సంఘాల ఆందోళనలతో తమ బండారం ఎక్కడ బయట పడుతుందో అని భావించిన వైబ్రాంట్ యాజమాన్యం విద్యార్థి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చి బెదిరింపులకు దిగే ప్రయత్నం చేసింది .
పరువునష్టం వేస్తామంటూ న్యూస్ 10 కు బెదిరింపులు….
ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఐఐటి ,జేఈఈ మెయిన్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ ల పేర లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారానికి తెరలేపిన వైబ్రాంట్ అకాడమీ పై వరుస కధనాలు ప్రచురిస్తు విద్యార్థుల పక్షాన నిలుస్తున్న న్యూస్ 10 దినపత్రిక పై వైబ్రాంట్ యాజమాన్యం విషం కక్కుతూ బెదిరింపులకు దిగుతోంది. తమ అక్రమ అడ్మిషన్ల దందా ఎక్కడ బయటపడి తమ విద్యా వ్యాపారం ఎప్పుడు మూతపడుతుందో అని పరువు నష్టం దావా వేస్తాం అంటూ బెదిరింపులకు దిగుతోంది.ఒకవేళ మీరు చేస్తున్న అడ్మిషన్ల ప్రక్రియ సక్రమమే అయితే కాలేజీకి విద్యా శాఖ నుండి పొందిన అనుమతి పత్రాలు బయటపెట్టాలని న్యూస్ 10 కోరుతుంది.అంతే కాకుండా కోట్ల రూపాయల స్కాలర్షిప్ లు ఇప్పటికి ఎంతమంది విద్యార్థులకు అందించారో కూడా బయటపెట్టాలంటోంది.ప్రజల తరపున వకాల్తా పుచ్చుకొని సమాజాహితం కోసం పాటు పడే న్యూస్ 10 పై పరోక్ష బెదిరింపులకు దిగడం సరికాదు.వైబ్రాంట్ అకాడమీ లాంటి బెదిరింపు లకు ఉడుత ఊపులకు న్యూస్ 10 ఏమాత్రం వెనక్కి తగ్గదని స్పష్టం చేస్తున్నాం
వైబ్రాంట్ అకాడమీ కి ఎలాంటి అనుమతులు లేవు..
డీఐఈఓ .గోపాల్
నక్కలగుట్ట కేంద్రంగా వెలసిన వైబ్రాంట్ అకాడమీ కి విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేవు.అకాడమీ పేరుతో ఇంటర్ అడ్మిషన్లు చేర్చుకోవడం నా దృష్టికి వచ్చింది.విద్యార్థులెవ్వరు వైబ్రాంట్ మోసపూరిత ప్రకటనలు చూసి నష్టపోవొద్దు.ఒకటి రెండు రోజుల్లో వైబ్రాంట్ అకాడమిపై చర్యలు తీసుకుంటాం….
వైబ్రాంట్ అకాడమీ ని మూసివేయాలి లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం…
ఏ బీ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద ప్రమీల నరేష్..
ఆల్ ఇండియా ర్యాంకులు,కోట్లల్లో స్కాలర్షిప్ ల ఆశజూపి అమాయక విద్యార్థులను కార్పొరేట్ విద్య పేరుతో బురిడీ కొట్టిస్తు కోట్లల్లో సొమ్ము చేసుకుంటున్న వైబ్రాంట్ అకాడమీ మూసివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న నక్కలగుట్ట లోని వైబ్రాంట్ మెయిన్ బ్రాంచీకి చేరుకొని ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా .ఏ బీ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద ప్రమీల నరేష్ మాట్లాడుతూ
ఇప్పటి వరకు ఇంటర్ అడ్మిషన్ల, ఐఐటి, జేఈఈ కోచింగ్ ల పేరుతో వసూలు చేసిన ఫీజులను తిరిగి ఇచ్చేయాలి. విద్యా శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కళాశాల నడిపేందుకు ప్రయత్నిస్తున్న వైబ్రాంట్ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు బుక్ చేయాలి లేని పక్షంలో ఏ బీ ఎస్ ఎఫ్,బీ ఎస్ ఎఫ్ ,బీ ఎస్ ఎఫ్ ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు బోట్ల మనోహర్ ఏ బీ ఎస్ ఏఫ్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు మచ్చ పవన్ కళ్యాణ్, ఉదయ్ ,వివేక్, శ్రీనాద్, పృథ్వి రాజ్ ,రమేష్ ,సాయి కిరణ్ ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు….