మార్నేని ఊసరవెల్లి సిగ్గు పడుతోంది

వరంగల్ జిల్లా డిసిసిబి చైర్మన్ మార్నేని దంపతుల పార్టీ మార్పు పై వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు ఘాటు విమర్శలు చేసారు.కన్న తల్లి లాంటి బి అర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపి మధుమతి వారి పదవులకు రాజీనామా చేయాలని జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ సొసైటీ చైర్మన్ వనం రెడ్డి ,కార్పోరేటర్ ఇండ్ల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఐనవోలు మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి కన్నతల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మార్నేని దంపతులు దమ్ముంటే వారి పదవులకు రాజీనామా చేయాలని,
మీ పదవులు బిఅర్ఎస్ పార్టీ పెట్టిన బిక్ష అని అన్నారు.మార్నేని టీడీపీ పార్టీ లో రాజకీయ నిరుద్యోగిగా తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్తితిలో ఉన్నప్పుడు అరూరి రమేష్ మార్నేని సతీమణి ని ఐనవోలు ఎంపిపి గా ,రవీందర్ రావు ను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిసిసిబి చైర్మన్ గా చేసారని కానీ విశ్వాసం లేకుండా , ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా పార్టీలు మారడం మార్నేని దంపతులకే చెల్లిందని విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అరూరి రమేష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి పార్టీకి తీవ్ర నష్టం చేశారని అన్నారు.
మార్నేని దంపతులు పార్టీ నుండి వెళ్లిపోతే నష్టమేమీ లేదని , పార్టీ వీడుతున్నది పదవుల కోసం కాదు ప్రజాసేవ కోసమే అని మోసపు ప్రకటనలు బంద్ చేసుకోవాలని అన్నారు. పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్త బయటికి పోతుంటే నిజమైన కార్యకర్తలకు బి ఆర్ ఎస్ అభిమానులకు స్వతంత్రం వచ్చినంత సంతోషంగా ఉందని అన్నారు .మార్నేని దంపతులు పార్టీ వీడడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి తంపుల మోహన్, సొసైటీ వైస్ చైర్మన్ బాబు,మాజి టెంపుల్ ఛైర్మన్ జైపాల్ యాదవ్, సీనియర్ నాయకులు లక్ష్మణ్ గౌడ్,అత్మ డైరెక్టర్లు రాజు, కట్లూరి రాజు,కో ఆప్షన్ సభ్యులు గుoశావలి సొసైటీ మండల ప్రచార కార్యదర్శి కోమలత,డైరెక్టర్ కుమార్,మాజి సర్పంచ్ కుమార్,నాయకులు మమిండ్ల సంపత్, శ్రవణ్,సంపత్, శేఖర్,ప్రభాకర్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here