ఏసిబి అధికారులు దూకుడు పెంచారు…వాహనదారులనుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు మే 25 న మహబూబాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో దాడులు నిర్వహించిన ఏ సి బి అధికారులు కొంత నగదును సైతం స్వాధీనం చేసుకున్నారు…ఈ నేపద్యంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాద్ రవాణా శాఖ అధికారి,ఎం వి ఐ మహమ్మద్ గౌస్ పాషా ,అతని ప్రయివేటు కారు డ్రైవర్ యళ్ల మందల సుబ్బారావు,ప్రయివేట్ అసిస్టెంట్ తణుకు రామ్ గోపాల్ లను ఆదివారం విచారణ నిమిత్తం ఏసిబి కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపి అరెస్ట్ చేసి సోమవారం ఉదయం ఎస్ పి ఈ ఏ సి బి కేసులు మరియు మూడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ ముందు హాజరు పరిచినట్లు ఎసిబి అధికారులు తెలిపారు….ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉందన్నారు….కాగా మే నెలలో మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఎసిబి దాడులు జరపగా ఆ దాడుల్లో ఆర్ టి ఏ ఏజెంట్ల వద్ద లెక్కల్లో చూపని నగదు రూ 61,600 లభ్యమయ్యాయని…వీటిని పరిశీలించేందుకు యల్లమందల సుబ్బారావుకు చెందిన లెక్కల్లో లేని నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని. మొబైల్ ఫోన్‌ను విశ్లేషించినప్పుడు, రోజువారీ,నెలవారీ లంచం,మమూళ్ల వసూళ్లు మరియు వివిధ ఖాతాలకు ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించిన ఫోటోషాట్‌ల రూపంలో నేరారోపణ ఆధారాలు గుర్తించబడ్డాయని ఏ సి బి అధికారులు తెలిపారు..గౌస్ పాషా, ఎం వి ఐ ఎఫ్ ఏ సి డి టి ఓ అతని ప్రైవేట్ డ్రైవర్, కుమారుడు మొహమ్మద్ ఆరీఫుద్దీన్ , మేనల్లుడు మొహమ్మద్ మునీర్ లు గౌస్ పాషా ఎంవీఐ ఎన్‌ఫోర్స్‌మెంట్ కరీంనగర్, ఆర్టీఓ ఖమ్మం, ఎంవీఐ ఎఫ్‌ఏసీ డీటీఓగా మహబూబాబాద్ ఏఓ-1 గా పనిచేసిన సమయంలో లంచం, మామూళ్లు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు… తన కారు డ్రైవర్ యల్లమందల సుబ్బా రావు ద్వారా అక్రమంగా గ్రానైట్ రవాణా మరియు డి ఎల్ లు, ఎల్ ఎల్ ఎస్, ఆర్ సి లు, ఎఫ్ సి లు జారీ చేయడంలో ప్రమేయం ఉన్న ప్రైవేట్ ఏజెంట్లు , వాహన యజమానుల నుండి లంచం,మామూళ్ల మొత్తాన్ని వసూల్ చేసి డి టి ఓ ప్రైవేట్ అసిస్టెంట్ తణుకు రామ్ గోపాల్
బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసినట్లు చెప్పారు . గౌస్ పాషా సూచనల ప్రకారం అతని కుమారుడు మొహమ్మద్. అరిఫుద్దీన్,మేనల్లుడు మహమ్మద్. మునీర్, యల్లమందల సుబ్బారావు తణుకు రామ్ గోపాల్ లు వసూలు చేసిన నగదు మొత్తాలను ఆన్‌లైన్‌లో వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించినట్లు ఏ సి బి అధికారులు పేర్కొన్నారు….