మణికాంత పై చర్యలు “ఏవి”….?

గురుకులాల్లో ప్రొవిజేన్స్ కాంట్రాక్టర్లు ఎం చేసిన చళ్తా…అన్నట్లు పరిస్థితులు కనపడుతున్నాయి….ప్రిన్సిపాల్ నుంచి అధికారి వరకు వారికే సహకరిస్తునట్లు ఆరోపణలు వస్తున్నాయి…వారు ఎలాంటి సరుకులు సరఫరా చేసిన వారిని ప్రిన్సిపాల్స్ ,అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి… నాసిరకం సరుకులు సరఫరా అవుతున్న ,ఉడికి ఉడకని థర్డ్ క్వాలిటీ కందిపప్పు అందిస్తున్న వారిపై చర్యలు ఉండడం లేదు…ఆ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదు…దీనిని గమనిస్తే తెరవెనుక అధికారులు,కాంట్రాక్టర్లకు ఎదో ఒప్పందం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…

మణికాంత పై చర్యలు” ఏవి”….?

పరకాల బాలుర గురుకులానికి ప్రొవిజేన్స్ సరఫరా చేస్తున్న మణికాంత ఏజెన్సిస్ పై చర్యలు తీసుకువడానికి అధికారులు ఎందుకో ఏమాత్రం ధైర్యం చేయడం లేదు…ఈ గురుకులానికి థర్డ్ క్వాలిటీ కందిపప్పు,పురుగుపట్టి నల్లగా మారిన యాలకులు,పనికిరాని గోధుమ పిండి లాంటి నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న అధికారులు ఎక్కడలేని సహకారం ఆ కాంట్రాక్టర్ కే అందిస్తున్నట్లు కనపడుతుంది… ఈ మణికాంత ఏజెన్సిస్ సరఫరా చేస్తున్న సరుకులు నాసిరకం అని న్యూస్ 10 పరిశీలనలో వెల్లడైంది…పరకాల బాలుర గురుకులం లో ఉన్న నాసిరకం సరుకులను ఫొటోలతో సహా ఇటీవలే న్యూస్10 ఓ కథనాన్ని వెలువరించింది…కాని ఇప్పటివరకు అధికారులు ఈ ఎజెన్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు… ఓ పక్క నాసిరకం సరుకుల వల్ల రాష్ట్రంలో కొన్ని గురుకులాల్లో విద్యార్థులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కుంటుండగా,కొందరు అస్వస్థతకు గురైతున్నారు…ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్న నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకువడానికి పాపం అధికారులకు ఏమాత్రం తీరిక దొరకడం లేదనుకుంటా…..

అడ్డుపడుతున్నదెవరు….?

పరకాల బాలుర గురుకులం లో నాసిరకం సరుకులు ఉన్నట్లు, అవి మణికాంత ఏజెన్సిస్ కాంట్రాక్టర్ సరఫరా చేసినట్లు న్యూస్10 పరిశీలనలో స్పష్టం ఐయ్యింది…కాని ఈ గురుకులం ప్రిన్సిపాల్ మాత్రం అదెలా…అని వాదన చేసేలా ఉన్నట్లు తెలుస్తుంది…తాను అసిలి సరుకులు అంటే అసిలి తాను నాసిరకం అంటే నాసిరకం అంతా నా ఇష్టం అన్నట్లు ఇక్కడి ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది…ఓ దశలో ఈ కాంట్రాక్టర్ వైపు ఆ ప్రిన్సిపాల్ వకాల్తా పుచ్చుకొని అధికారులకు సైతం తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు….రాష్ట్రంలో ఉన్న గురుకులాలు అన్ని తన అజమాయిషీలో నడుస్తున్నట్లు ఏ(వి)మి జరిగినా తాను చూసుకుంటానని అభయహస్తం ఇస్తున్నట్లు తెలుస్తుంది….కాంట్రాక్టర్ కు సహకరిస్తున్న ఈ ప్రిన్సిపాల్ అధికారులు చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నట్లు స్పష్టం అవుతున్నట్లు కనపడుతుంది….

ఇతగాడి కాంట్రాక్టులు నాలుగు పైనే….
మరో సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here