భూపాలపల్లి బరిలో ఉంటా…

భూపాలపల్లి ఏమ్మెల్యే బరిలో తాను నిలుస్తున్నట్లు కెయూ జేఏసీ నాయకుడు, ,ఏ బి ఎస్ ఎఫ్ విద్యార్థి నాయకుడు మంద నరేష్ చెప్పారు…అనేక ప్రజా,విద్యార్థి ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న మంద నరేష్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక బరిలో నిలువనున్నట్లు న్యూస్10 కు తెలిపారు…ఓ విద్యార్థి నాయకుడిగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ పోరాటాలు చేసిన తాను ఎమ్మెల్యే గా బరిలో నిలువడానికి కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయన్నారు….భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి విద్యార్థుల సత్తా ఏంటో తాను తప్పక నిరూపిస్తానని మంద నరేశ్ ధీమా వ్యక్తంచేశారు….

బి ఎస్ పి అవకాశం ఇస్తే….
భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ బి ఎస్ పి పార్టీ నుంచి తనకు కేటాయిస్తే బహుజనవాదం తో ప్రజల మధ్య ప్రచారం నిర్వహించి బహుజన వాదానికి ఉన్న బలం ఏంటో …బహుజనుల సత్తా ఏంటో తాను నిరూపించి తీరుతానని అన్నారు…. అంతేకాదు తనకు బీఎస్పీ పార్టీ అవకాశం ఇస్తే విద్యార్థి, నిరుద్యోగుల సత్తా ఏంటో బీ ఆర్ ఎస్ కు రుచి చూపిస్తానని అన్నారు…మరోవైపు భూపాలపల్లి నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్న క్రమంలో కాకతీయ యూనివర్సిటీ నుండి విద్యార్థి నాయకుడు బరిలో దిగుతుండటం ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటు బ్యాంకు కు గండి పడుతుందని ఓట్లు చీలడం ఖాయమని నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది….
కాకతీయ యూనివర్సిటీ నుండి ఈ సారి ఏమ్మెల్యే గా భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి తన బలాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్న విద్యార్థి నాయకుడికి విద్యార్థులు వారి తల్లీ దండ్రులు నిరుద్యోగ యువత ,,ప్రజా సంఘాలు, కులసంఘాలు మద్దతూ తెలపటం కోసం సిద్దంగా ఉన్నట్లు తెలిసింది….

విద్యార్థి నాయకుడిగా….

గత 15 సంత్సరాలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ బీ ఎస్ ఏఫ్ విద్యార్థి సంఘంలో పని చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు సేవ చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందిన మంద నరేష్ శాయంపేట మండలం లోని పెద్దకోడెపాక గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి అక్కడే పదవ తరగతి వరకు చదువుకొని పరకాలలో ఇంటర్ ,డిగ్రీ, బీఎడ్ పూర్తి చేసి పై చదువుల కోసం కాకతీయ యూనివర్సిటీలో అడుగు పెట్టి ఏ బీ ఎస్ ఏఫ్ జెండా పట్టుకొని విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ మరోపక్క పేద విద్యార్థులను చదివిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలలో నిరుపేద విద్యార్థులకు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కు ప్రైవేట్ విద్యాసంస్థలతో మాట్లాడి ఆతి తక్కువ ఫీజులతో వారిని చదివిస్తు వారికి అండగా నిలుస్తున్న విద్యార్థి నాయకుడు మంద నరేష్ అనేక ప్రశంసలు పొందారు…ఎంతోమంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకోసం చదువుతూ ,ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడానికి సైతం వారికి ఆర్థిక స్థోమత లేకుంటే అలాంటి వారిని ఎంతోమంది ని చేరదీసి వారికి కోచింగ్ ఇప్పించిన ఘనత మంద నరేష్ కే దక్కుతుంది… అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో బయట ప్రైవేట్ హాస్టల్స్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులకు కాకతీయ యూనివర్సిటీ షెల్టర్ కల్పించి వారికి పెద్దన్నగా తోడుగా నిలుస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు….తెలంగాణా ఉద్యమాన్ని బలంగా భూపాలపల్లి ,పరకాల నియోజకవర్గంలో ఉదృతం చేసిన క్రమంలో ఎన్ని కేసులు అయినా వెనకడుగు వేయకుండా తెలంగాణా నినాదన్ని బలంగా వినపించిన విద్యార్థి నాయకుడు మంద నరేష్..
భూపాలపల్లి నియోజకవర్గం లో ఉన్న అన్ని గ్రామాలలో విద్యార్థి నిరుద్యోగ యువకులతో టచ్ లో ఉంటూ వారి మద్దతూ కూడగడుతు ఇప్పటికే తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు….బీఎస్పీ పార్టీ టికెట్ నీ ఆశిస్తూ భూపాలపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి సిద్దపడుతూ నియోజకవర్గంలో గులాబీ పార్టీ నీ ఓడించాలనీ కంకణం కట్టుకొని తిరుగుతున్నట్లు తెలుస్తుంది…

గులాబీకి గండి….

భూపాలపల్లి, నియోజకవర్గములో రాజకీయ సమీకరణాలు మారుతున్న క్రమంలో గులాబీ కోటకు ఎదురుగాలి తగులనుందనే ప్రచారం జరుగుతుంది.. ..ఒక పక్క కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడి రాకతో భూపాలపల్లిలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగ యువత ఎస్సి, ఎస్టి ,బీసీ ,మైనారిటీ ప్రజలు విద్యార్థి నాయకుడిగా తనకు అండగా ఉండి గులాబీపార్టీనీ ఓడించాలనీ చూస్తున్నట్లు మంద నరేశ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు…. ప్రధానంగా గులాబీ ఓట్లకు తాను పెద్దఎత్తున గండి కొట్టి గండ్ర కు చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here