భూపాలపల్లి నియోజకవర్గంలో బహుజనవాదాన్ని భుజానెత్తుకొని పట్టుదల,కార్యదీక్ష తో ముందుకు సాగుతున్నాడు…ఓ యువ బహుజనవాది… బహుజన రాజ్యాధికార సాధనలో తనవంతు కర్తవ్యంగా స్వేరోస్ భద్రాద్రి జోన్ కన్వీనర్ గా కొనసాగుతూనే నీలి జెండా నీడన బహుజన వాదంతో యువతలో చైతన్యాన్ని నింపేందుకు అహర్నిశలు పాటుపడుతున్నాడు… సాంప్రదాయిక ,దోపిడీ రాజకీయాలకు చెక్ పెట్టి ప్రజల క్షేమాన్ని,సంక్షేమాన్ని కాంక్షించే స్వార్ధ రహిత రాజకీయాలకోసం బి ఎస్ పి తెలంగాణ చీఫ్ ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ స్ఫూర్తి తో భూపాలపల్లి లో తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు….బహుజన వాదంతో భూపాలపల్లి నియోజకవర్గం మొత్తం పర్యటించి బి యస్ పి కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు మారేపల్లి మనోజ్ కుమార్ తన కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు న్యూస్10 కు తెలిపారు….బి ఎస్ పి మెజార్టీ ప్రజలకోసం రూపొందించిన బహుజన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనవంతు కృషిని కొనసాగిస్తానని,ఈ ప్రయత్నంలో ఎన్ని అటు పోట్లు ఎదురైన ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మనోజ్ అన్నారు….
గండ్ర చేసిందేమిటి…..?
భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న గండ్ర వెంకట రమణారెడ్డి నియోజకవర్గంలోని బహుజనులకు చేసిందేమీ లేదని ,పదవులు పొంది ఆస్తులు కూడబెట్టడం తప్ప ఎమ్మెల్యే ద్వార నియోజకవర్గానికి ఒరిగిందేమిలేదన్నారు….ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడం,అధికారం ఉందికదా అని ఇష్టారీతిన వ్యవహరించడం తప్ప చేసిందేమీ లేదన్నారు….నియోజకవర్గంలోని మండలాలు,గ్రామాల్లో తనకు సంబంధించిన కొంతమంది అనుచరులను పెంచి పోషించి ప్రశ్నించే యువకులను,ప్రజలను వారిద్వారా బెదిరించడమే గండ్ర పనిగా పెట్టుకున్నారని మారేపల్లి మనోజ్ కుమార్ ఆరోపించారు…ఎమ్మెల్యే సతీమణి జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి సైతం మహిళలు ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడం అలవాటుగా మారిందని ఇటీవల శాయంపేట మండలం ప్రగతి సింగారం లో బతుకమ్మ చీరల పంపిణీ లో చీరల నాణ్యత గూర్చి ప్రశ్నించిన మహిళలను బెదిరించడం ఇందుకు నిదర్శనమని మారేపల్లి గుర్తుచేశారు…..భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వైఫల్యాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని సమాజం పట్ల అవగాహన బహుజన సిద్ధాంతాల పట్ల అవగాహన ఉన్న స్వేరోస్ విద్యార్థి సంఘ నాయకుడిగా ఇంటింటి ప్రచారం నిర్వహించి గండ్ర బెదిరింపు రాజకీయాలకు చరమగీతం పాడుతామని అన్నారు…భూపాలపల్లి నియోజకవర్గంలో బి ఆర్ యస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఓటమే ద్యేయంగా పనిచేస్తూ భూపాలపల్లి గడ్డపై నీలి జెండా ఎగురవేస్తామని …నియోజకవర్గంలో నీలి విప్లవాన్ని ,ఏనుగు వేగాన్ని ఆపడం ఎవరి తరం కాదని మనోజ్ కుమార్ అన్నారు…అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో నీలి జెండా రెపరేపలాడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు…బహుజన ఆలోచన ఉన్న ప్రతిఒక్కరు తమతో కలిసి రావాలని మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు…..