వరంగల్ నగరంలో కొద్దీ సేపటి క్రితం భారీ కొండ చిలువ కలకలం రేపింది.మహానగర మున్సిపాలిటీ పక్కనే వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో భారీ కొండ చిలువ ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు,స్థానిక అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు..వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు స్నేక్ క్యాచర్లు కొండ చిలువను బంధించి సురక్షితంగా హన్మకొండ జంతు ప్రదర్శనశాలకు తరలించినట్లు సమాచారం.దాదాపు 15 అడుగులు ఉన్న కొండ చిలువ గతంలో అనేక సార్లు స్థానికులకు కనిపించిందని తెలిపారు…