బొల్లికుంటలో వెంచర్ బురిడీ

బొల్లికుంటలో వెంచర్ పేరుతో కొందరు రియల్టర్లు ప్రజలను బురిడీ కొట్టించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది…వెంచర్ పేరుతో కొనుగోలుదారులను ఆకర్షించి ప్లాట్లు విక్రహించేందుకు వీరు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది…వెంచర్ ఏర్పాటు కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అనుమతులు లేకుండానే వెంచర్ వేసి ప్లాట్లు అమ్మేందుకు వారు రంగం సిద్ధంచేసుకున్నట్లు తెలిసింది…ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎకరాల 14 గుంటల భూమిలో వీరు వెంచర్ ఏర్పాటు చేసి అక్కడి భూమిని చదును చేసి కేవలం రాళ్లు పాతి వెంచర్లో అమ్మకాల దందా షురూ చేసినట్లు స్థానికులు చెపుతున్నారు…వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని ఎర్రకుంటకు సమీపంలో ఈ వెంచర్ ను ఏర్పాటు చేశారు….ముచ్చటగా మూడెకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ వెంచర్ నిర్వాహకులు గుంటల వారిగా ప్లాట్లు అమ్మేందుకు సిద్ధం ఐయినట్లు తెలుస్తుంది….ఇది ఇలావుంటే వెంచర్ కోసం అన్ని సిద్ధం చేసి ప్లాట్ల అమ్మకాల ప్రారంభానికి సిద్ధం ఐయి ఆ తర్వాత లే అవుట్ అనుమతి తెచ్చుకుంటామని కొంతమంది కొనుగోలుదారులకు వెంచర్ యాజమాన్యం చెపుతున్నట్లు తెలిసింది…ఓ పక్క ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ ఏర్పాటు చేసి ,భూమి చదునుచేసి రాళ్లు పాతి,వెంచర్ చుట్టూ ప్రహారి నిర్మించి అన్ని సిద్ధం చేసిన తర్వాత లే ఔట్ అనుమతికి వెళ్తామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది….మరి ఈ అనుమతిలేని వెంచర్ పై అధికారులు ఎం చర్యలు తీసుకుంటారో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here