బియ్యం తరలింపునకు స్కెచ్

మహబూబాబాద్ జిల్లాలోని ఇన్వెస్టర్ గోదాముల్లో రీసైక్లింగ్ బియ్యం(పీడీఎస్) భారీగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.కొంతమంది మిల్లర్ లు తెచ్చిన రీసైక్లింగ్(పిడిఎస్)బియ్యాన్ని ఎటువంటి టెస్ట్ లు నిర్వహించకుండా నే టీఏ పాస్ చేసినట్లు తెలుస్తోంది. రీసైక్లింగ్(పిడీఎస్)బియ్యాన్ని పాస్ చేసేందుకు ఒక్కో ఏసికే కు సుమారు 50 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు ముడుపులు తీసుకొని ఆ బియ్యాన్ని పాస్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ అధికారులు ,ఎస్ డబ్ల్యూ సి అధికారులు కుమ్మక్కైనట్లు నిజాయితీగా ఉండే మిల్లర్ లు బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. పౌరసరఫరాల శాఖ ముడుపులు పుచ్చుకుని పాస్ చేసిన బియ్యాన్ని (పిడిఎస్) అనుకోకుండా విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తే వీరి భాగోతం బయటపడుతోందని ముందుగానే ఊహించే వీరు ఆ బియ్యానికి రేపు లేదా ఎల్లుండి వరకే “ఆర్ ఓ” ఇచ్చి “ఎం ఎల్ ఎస్ ” పాయింట్ లకు తరలించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు స్కెచ్ వేశారని తెలిసింది.

రేపోమాపో “ఆర్ ఓ”లు ఇచ్చేందుకు ప్లాన్

జిల్లాలో ఉన్న కేసముధ్రం, అనంతారం ఇన్వెస్టర్ గోదాముల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు, ఎస్ డబ్ల్యూ సి అధికారుల చేతివాటం తో రీసైక్లింగ్ (పిడిఎస్)బియ్యం భారీగానే నిల్వ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ సమయంలో ఉన్నతాధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఎప్పుడూ తనిఖీలకు వస్తారో అని టెన్షన్ పడుతున్న అధికారులకు ఓ క్రిమినల్ ఆలోచన వచ్చిందట. రేపో మాపో ఆ బియ్యానికి “ఆర్ ఓ” ఇస్తే గోదాముల నుండి ఆ బియ్యం బయటికి పోతుంది కనుక తక్షణమే ఆ ఏసికే లకు “ఆర్ ఓ” ఇస్తే ఆ బియ్యాన్ని ఎవరు కనిపెట్టలేరని రేపో మాపో ఆర్ ఓ లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

“ఆర్ ఓ” నిలిపివేయాలి ! కలెక్టర్ తనిఖీ చేయాలి!!

కేసముధ్రం ,అనంతారం ఇన్వెస్టర్ గోదాముల్లో నిబంధనలకు విరుద్ధంగా పాస్ చేసిన రీసైక్లింగ్ బియ్యాన్ని(పిడీఎస్) రేపోమాపో “ఆర్ ఓ” ఇచ్చి ఎం ఎల్ ఎస్ పాయింట్లకు తరలించి చేతులు దులుపుకునే ఆలోచనలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆ గోదాముల్లో నుండి ఒక్క బియ్యం గింజ బయటికిపోకుండా పౌరసరఫరాల శాఖ ఇచ్చే “ఆర్ ఓ” లను ఒక్కరోజు నిలిపివేసి క్షేత్రస్థాయిలో ఆ రెండు గోదాముల్లో తనిఖీ చేస్తే రీసైక్లింగ్ బియ్యం(పిడిఎస్) భారీ స్థాయిలో దొరుకుతాయని తెలిసింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here