ప్రొవిజెన్స్ కాంట్రాక్ట్ ముదుర్లు

గురుకులాల్లో టెండర్ ల భాగోతం బాగానే నడుస్తున్నట్లు కనపడుతుంది…సాంఘీక సంక్షేమ శాఖ ,ఎం జె పి,గిరిజన సంక్షేమ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ గురుకులాల్లో కొందరు కాంట్రాక్టర్లు ఏండ్లుగా పాతుకొని పోయి అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి…ఒకే కేటగిరీలో పదికి పైగా టెండర్లు వేసి కాంట్రాక్టు దక్కించుకుని కొందరు కాంట్రాక్టర్లు అధికారులను మచ్చిక చేసుకొని తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది…ఇక కొందరు కాంట్రాక్టర్లు అన్ని గురుకులాల్లో టెండర్ దక్కించుకుని కొన్ని సంవత్సరాలుగా అక్కడే కాంట్రాక్టర్లుగా కొనసాగుతున్నట్లు తెలియవచ్చింది…ప్రతిసారి టెండర్ వేయడం ఖచ్చితంగా టెండర్ దక్కించుకోవడం వీరికి అలవాటుగా మారిపోగా ప్రతిసారి వీరికే టెండర్ దక్కుతుందో…ఎలా ఏండ్ల కొద్దీ కాంట్రాక్టర్లు గా ఒకే చోట ఉంటున్నారో గురుకులాల అధికారులకే తెలియాలి….

ప్రొవిజెన్స్ లో వారిదే హవా….?

వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొంతమంది కాంట్రాక్టర్లు ప్రొవిజేన్స్ టెండర్లలో తమ హవా కొనసాగిస్తున్నారట…అన్ని గురుకులాల్లో పాతుకుపోయిన వీరు టెండర్ వేస్తే చాలు పక్కాగా కాంట్రాక్టు వీరికే వస్తుందట….వరంగల్ నగరంలో ఓ పెద్ద కిరాణా దుకాణం నడుపుతున్న పెద్దమనిషి ప్రొవిజేన్స్ కాంట్రాక్ట్ నడపడంలో ఆరితేరినట్లు తెలుస్తుంది…ఇతగాడితో పాటు మరో నలుగురు ఈ కేటగిరీలో ప్రతి సంవత్సరం టెండర్ వేసి కాంట్రాక్ట్ దక్కించుకుని బాగానే వెనకేసినట్లు సమాచారం….విచిత్రం ఏంటంటే ఈ కాంట్రాక్టర్లల్లో ఓ కాంట్రాక్టర్ గత పదిహేను సంవత్సరాలుగా 8 కి పైగా టెండర్లు దక్కించుకుంటున్నాడంటే వీరి పరపతి గురుకులాల అధికారులవద్ద వీరి పైరవి బలం ఏ రకంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు….అంతేకాదు గురుకులాలకు కూరగాయలు, పండ్లు సరఫరాలో టెండర్ ను సైతం కొందరు కాంట్రాక్టర్లు పదే పదే దక్కించుకోవడం ఒక్కో కాంట్రాక్టర్ నాలుగు,ఐదు కాంట్రాక్టులు దక్కించుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది… వీరిలో కూడా కొందరు కాంట్రాక్టర్లు సంవత్సరాల కొద్దీ టెండర్ దక్కించుకోవడం వెనక మతలబు ఏంటో అధికారులకే తెలియాలి…

సర్కార్ చెప్పేదొకటి… సరఫరా చేసేది ఇంకోటి…

ఎంటర్ప్రైజెస్,ట్రేడర్స్ పేరుతో టెండర్లు..అందరూ కలిసి ఒకే దందా..

టెండర్లలో హవా సాగిస్తున్న ఆ ఐదుగురు….

మరో సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here