హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒడితెల ప్రణవ్ తన ప్రచారంలో దూసుకుపోతున్నారు…..నియోజకవర్గంలోని గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని పరిగెత్తిస్తున్నారు…ఏ గ్రామానికి వెళ్లిన ప్రణవ్ కు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు…. ప్రణవ్ తాత సింగపురం రాజేశ్వరరావు కు ఆ గ్రామలతో ఉన్న అనుబంధం గతంలో ఆ గ్రామాల్లో ఆయన చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ తాము తప్పకుండా ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించుకుంటామని మాట ఇస్తున్నారు…ఈసారి నియోజకవర్గంలో మార్పు తధ్యమని కాంగ్రెస్ గెలుపు పక్కా అని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు….కాగా ఈసారి హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ అంచనాలు తలకిందులు కానున్నాయి….ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రాజకీయంలో సీనియర్లు బిజేపి నుంచి ఈటల రాజేందర్,బి ఆర్ ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి లు ఉన్నారు…కాగా ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరు ప్రధాన పోటీలో ఉంటారని అందరూ అనుకోగా ఊహించనివిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఒడితెల ప్రణవ్ బరిలో నిలవడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ అంచనాలు తలకిందులు ఐయేట్లు కనపడుతున్నాయి….నియోజకవర్గంలో ప్రణవ్ ప్రభంజనం కొనసాగుతుండగా ఈ ప్రభంజనంలో సీనియర్లు గల్లంతు కానున్నారని పలువురు అంచనా వేస్తున్నారు…గత కొన్ని దశాబ్దాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రణవ్ కుటుంబానికి ఉన్న అత్యంత దగ్గరి అనుబంధం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఈ నియోజకవర్గంనుంచి ప్రణవ్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు…ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చిన ప్రణవ్ మరోవైపు రాజకీయల్లో,ప్రజల్లో ప్రణవ్ కుటుంబానికి ఉన్న మచ్చలేని ట్రాక్ రికార్డ్ అతి సునాయాసంగా విజయం సాధించి పెట్టేలా ఉంది…ప్రచారంలో దూసుకువెళుతున్న ప్రణవ్ కు వస్తున్న ఆదరణను చూస్తే ఆయన గెలుపు ఎప్పుడో ఖాయమైందని ఆయన అనుచరులు అంటున్నారు…సీనియర్లను పక్కన పెట్టి ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రణవ్ కు ప్రజలు తప్పక ఎమ్మెల్యే గా పట్టం కడతారని వారు అంటున్నారు….కాగా ఇటీవల టి పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు మరింతగా మారిపోయాయి గెలుపుకు మరింత చేరువగా ప్రణవ్ చేరుకున్నాడని ఇక్కడ ప్రస్తుతం టాక్ నడుస్తుంది….హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రణవ్ భారీ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టిస్తాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..హుజూరాబాద్ నియజకవర్గంలో యువకుడైన ప్రణవ్ ట్రెండ్ నడుస్తుందని వారు విశ్లేషించారు…ట్రెండ్ ఇలాగే కొనసాగుతూ ప్రణవ్ విజయాన్ని సాధిస్తారని వారు అంటున్నారు….