పోలీసుల ప్లాగ్ మార్చ్

 

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వ హించడంలో భాగంగా స్థానిక పోలీసులతోపాటు సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో మట్టేవాడ, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ కవాతు నిర్వహించారు . వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్న ఈ కవాతు పోచమ్మమైదన్ నుంచి ప్రారంభమైన కవాతు మండిబజార్, చౌరస్తా, వరంగల్ రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. ఈ నంద ర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అర్బన్ ప్రజల ఓట్ల శాతం పెంచడంతో పాటు ఎన్నికల వేళ శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని. ఈ కవాతు లో మూడు కంపెనీల సి. ఆర్. పి. ఎస్, సివిల్, డిస్త్రిక్ గార్డ్స్ పోలీసులు పాల్గొన్నారని.కార్య క్రమంలో డీసీపీ అబ్దుల్ భారీ, ట్రైనీ ఐపిఎస్ శుభం నాగ్, సీఆర్. పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భగత్, ఏసీపీ లు ,నందిరామ్ నాయక్, దేవేందర్ రెడ్డి, తిరుమల్తో పాటు సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్లు ఎస్. ఐలు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here