పొగబెట్టిందెవరు…..?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పరకాల,వరంగల్ తూర్పు,వర్ధన్నపేట లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి….ప్రధానంగా వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ టికెట్ పొందిన కొండా సురేఖ తూర్పులో విజయం సాధించడం కోసం బి ఆర్ ఎస్ లో ఉన్న ప్రస్తుత ,మాజీ కార్పొరేటర్లు ఇతర నాయకులను తన వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు…ఈ ప్రయత్నాలు కొండా మురళి తూర్పులో జోరుగా కొనసాగిస్తుండగా చేరికల విషయంలో కొంతమేర సక్సెస్ ఐయినట్లే కనిపిస్తున్నారు…మొన్నటి వరకు తనతో విభేదించి దూరంగా ఉంటున్న గతంలో తన ప్రధాన అనుచరుడు బి ఆర్ ఎస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ ను తిరిగి తనవద్దకు వచ్చేలా కాంగ్రెస్ లో చేరేలా కొండా మురళి మంత్రాగం నడిపి నవీన్ రాజ్ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు…నవీన్ రాజ్ బి ఆర్ ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరుతున్నాడని తెలిసి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయినట్లు తెలిసింది…నవీన్ రాజ్ కాంగ్రెస్ లో చేరితే వర్ధన్నపేట, వరంగల్ తూర్పు,పరకాల నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని తెలిసి ఇప్పటికే బి ఆర్ ఎస్ శిబిరంలో కొంతమేర కలవరం మొదలయిందట….

ఇంతకీ పొగ బెట్టింది ఎవరు….?
కొండా మురళీ కి మొదటినుంచి ప్రధాన అనుచరిడిగా ఉన్న నవీన్ రాజ్ కొన్ని విషయాల్లో కొండా ను విభేదించి చాలా ఏళ్లుగా ఆయనకు దూరంగా ఉంటూ బి ఆర్ ఎస్ పార్టీ లో కొనసాగుతున్నాడు…యూత్ పాలోయింగ్ బాగానే ఉన్న నవీన్ రాజ్ మూడు నియోజకవర్గాలను ప్రభావితం చేస్తాడన్న పేరు ఉంది..అయితే ఇలా ఫాలోవర్స్ ఉండడం ,ప్రభావితం చేసే స్థాయిలో నవీన్ రాజ్ ఉండడం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కి,వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు ఏమాత్రం గిట్టలేదట…మేము ఎమ్మెల్యే లుగా కొనసాగుతున్న నియోజకవర్గాల్లో నీకు పాలోయింగ్ ఏంటి అని గుర్రుగా ఉండేవారట…వీరిలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఓ అడుగు ముందుకు వేసి నవీన్ రాజ్ ఇంటికి ఎవరు వెళ్లిన ఎవరు మాట్లాడిన ఆరాలు తీయడం మొదలుపెట్టాడట…అంతేకాదు నీ ఇంటికి ఏ కార్యకర్త ,నాయకుడు రావద్దు అని నవీన్ రాజ్ కు హుకుం జారీ చేశాడట…అంతటితో ఆగకుండా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఏ పోలీస్ స్టేషన్ కు నవీన్ రాజ్ ఫోన్ చేసిన ఏ పోలీస్ అధికారి సహకరించవద్దని చెప్పాడట… నవీన్ రాజ్ పట్ల తూర్పు ఎమ్మెల్యే అనుసరించిన విధానాన్నే పరకాల ఎమ్మెల్యే సైతం అనుసరించాడట…నవీన్ రాజ్ కు పరకాల నియోజకవర్గంలో ఎక్కడ పరపతి లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశాడట…ఈ ఇద్దరి ఎమ్మెల్యే ల కారణంగా గత కొద్ది నెలలుగా కామ్ గా ఉంటున్న నవీన్ రాజ్ కొండా మురళి కాంగ్రెస్ లోకి ఆహ్వానించగానే కాంగ్రెస్ లో చేరేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది…గత కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం నవీన్ రాజ్ కు కార్పొరేటర్ టికెట్ రాకుండా అడ్డుకుంది ఆ ఇద్దరు ఎమ్మెల్యే లేనని అప్పుడు నవీన్ నారాజ్ ఐయి వేరే నిర్ణయం తీసుకునే లోపే కేటీఆర్ జోక్యంతో వెనక్కి తగ్గిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు నవీన్ రాజ్ ను పూర్తిగా పట్టించుకోకుండా ఉండడం వల్ల బి ఆర్ ఎస్ ను వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది…ఎన్నికల వేల అందరిని కలుపుకుపోయి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తూ నవీన్ రాజ్ లాంటి నాయకుడు పార్టీని వదిలేలా పొగ బెట్టడం గులాబీ పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది…నవీన్ రాజ్ పార్టీని వీడితే ఆ మూడు నియోజకవర్గాల్లో గులాబీ ఓట్లకు భారీగానే గండి పడుతుందని స్వయంగా కొందరు గులాబీ నేతలే ఒప్పుకుంటున్నారు…ఇంతకీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి అని కామెంట్లు చేస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here