పేపర్ లికేజ్ కి సూత్రధారి బండి సంజయ్

పేపర్ లికేజ్ కి సూత్రధారి బండి సంజయ్ అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ వి రంగనాధ్ తెలిపారు…బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పలు విషయాలు సీపీ వెల్లడించారు.పదవ తరగతి ప్రశ్నపత్రం లికేజ్ కేసులో
A1గా బండి సంజయ్,A2గా బొరం ప్రశాంత్,A3గా మహేష్,A4గా శివ గణేష్, A5 మైనర్ బాలుడు ఉన్నట్లు సీపీ వెల్లడించారు…హిందీ ప్రశ్న పత్రం కమలాపూర్ బాలుర పాఠశాల నుండి బయటకు వచ్చిందని,చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ను ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారన్నారు…

బురం ప్రశాంత్ అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదని, చాల మందికి తాను ప్రశ్నపత్రం వాట్సప్ లో పంపించాడని గుండెబోయిన మహేష్ కూడా చాలామందికి పంపించారని సీపీ తెలిపారు…బూరం ప్రశాంత్
ఈటెల రాజేందర్ కు కూడా ప్రశ్న పత్రం పంపించారని,మొన్న సాయంత్రం బండి సంజయ్ తో ప్రశాంత్ వాట్సప్ చాటింగ్ చేసాడని,ప్రశాంత్ చాటింగ్ లో పేర్కొన్న అంశాలను బండి సంజయ్ ప్రెస్ మీట్ లో మాట్లాడాడని కమిషనర్ పేర్కొన్నారు…ముందు రోజు సైతం వాట్సప్ కాల్ బండి సంజయ్ తో ప్రశాంత్ మాట్లాడాడని,బండి సంజయ్ ఫోన్ లేదు అంటున్నాడు, ఫోన్ ఇస్తే మాకు కీలక సమాచారం వస్తుందని అన్నారు కాల్ డేటా ఇంకా రావాలిసి ఉందని, వాట్సప్ చాటింగ్ కూడా ఇంకా రావాలని,కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే కేసు బుక్ చేయలేదని సీపీ స్పష్టంచేశారు…బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రశాంత్ పనిచేస్తున్నాడని,మరోవైపు కేవలం
కమలాపూర్ లోనే ఎందుకు పేపర్లు లీక్ అవుతున్నాయని తాము ఆరా తీసామని ముందుగా మాట్లాడుకుని గేమ్ ప్లాన్ ప్రకారం కమలాపూర్ నుండి లీక్ చేస్తున్నారని సీపీ వివరించారు..ఇది యాదృచ్చికంగా జరుగుతుంది కాదని, గేమ్ ప్లాన్ ప్రకారం పేపర్ లికేజ్ జరుగుతుందన్నారు.41సీఆర్పీ ప్రకారం వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చని,పార్లమెంట్ స్పీకర్ కూడా సమాచారం ఇచ్చాము, అరెస్ట్ వివరాలు తెలిపామని సీపీ అన్నారు….పక్కా లీగల్ ప్రాసెస్ చేస్తున్నాం, రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదన్న సీపీ వరంగల్ లో ఎక్కువ అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వారినేనని చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here