పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్లు పర్వం

ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జోరుగా వసూళ్ల దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ కు ఓ రేటు ఫిక్స్ చేసి మరీ అధికారితోపాటు ఉద్యోగులు వసూళ్లకు తెగబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ కార్యాలయంలో ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ తో పాటు అటెండర్ ను ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా 6 నెలల క్రితం పట్టుకున్నారు.ఆ ఘటనతో పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉలిక్కిపడింది. దాంతో ఆ సబ్ రిజిస్ట్రార్ స్థానంలో ఓ ఉద్యోగికి సబ్ రిజిస్ట్రార్ గా ఇంచార్జి బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారు. ఏసిబి అధికారులు రైడ్ చేసి 6 నెలలు గడవకముందే అదే కార్యాలయంలో మళ్ళీ వసూళ్ల రాజ్యం మొదలైనట్లుగా కనిపిస్తోంది .నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తూ అందినకాడికి దండుకోవడంతో ఏ రిజిస్ట్రేషన్ కావాలన్నా డాక్యుమెంట్ వారిగా వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం.కార్యాలయంలో మామూళ్లు బహిరంగంగా మామూళ్లు తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుందని గమనించిన అధికారులు కార్యాలయం బయట ప్రైవేట్ అసిస్టెంట్ లను నియమించుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.ఆశ్చర్యం ఏమిటంటే ఆ కార్యాలయంలో మామూళ్ల రూపంలో రోజుకు 10 లకారాల పైనే వసూళ్లు అవుతున్నాయని తెలిసింది.

రియల్టర్ లకు సహకారం…

పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నట్లు సమాచారం. రియల్టర్ లు చేసే అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను ప్లాటుకు ఓ రేటు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది . సామాన్య ప్రజల రిజిస్ట్రేషన్ లకు నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టే వీరు రియల్టర్ లకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అనధికార లేఅవుట్ లలోని ప్లాట్లను సునాయాసంగా రిజిస్ట్రేషన్ లు చేస్తూ భారీ నజరానాలు పొందుతున్నట్లు వినికిడి

ఏసిబి రైడ్ జరిగినా ఆగని వసూళ్లు…

ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో సబ్ రిజిస్ట్రార్ ఓ వ్యక్తి నుండి లంచం తీసుకున్న కేసులో సబ్ రిజిస్ట్రార్ తో పాటు అటెండర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి సస్పెండ్ అయినప్పటికీ కార్యాలయంలో వసూళ్లు మాత్రం ఆగట్లేదట. సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కాగా ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు తీసుకున్న ఆ ఉద్యోగి కూడా వసూళ్లను బాగానే ప్రోత్సహిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏసిబి రైడ్ జరిగి 6 నెలలు గడవకముందే బరితెగింపుతనంతో అక్కడ వసూళ్లు జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

అసలు ఆ కార్యాలయంలో ఏంజరుగుతుంది …వసూళ్లు చేసేదెవరు ….? వసూలు అయిన మొత్తంలో ఎవరి వాటా ఎంత ….? సంచలనాత్మక కథనం న్యూస్-10 లో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here