రవాణాశాఖలో గత ప్రభుత్వంలో చక్రం తిప్పి రవాణాశాఖ అంటేనే తాను అన్నట్లుగా హవా కొనసాగించిన డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ అధికారి పాపాలరావు స్వచ్చంద పదవీ విరమణ చేసి ఉద్యోగం నుంచి వైదొలిగినట్లు తెలుస్తుంది…తనపై శాఖలో భారీగా అవినీతి ఆరోపణలు రావడం,గత ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో వి ఆర్ ఎస్ కోసం ధరఖాస్తు చేసుకోగా ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించకుండా….వి ఆర్ ఎస్ ధరఖాస్తు కు ఆమోదం తెలపకుండా ఉన్న సర్కార్ తాజాగా పాపారావు వి ఆర్ ఎస్ కు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం…. మొన్నటివరకు డి టి సి పాపారావు వి ఆర్ ఎస్ కు ఆమోదం తెలపని రవాణాశాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం…దింతో రవాణాశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పాపారావు కు ఉపశమనం దక్కినట్లే కనపడుతుంది…అవినీతి అధికారుల భరతం పడతాం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పై విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం అని చెప్పిన సర్కార్ డి టి సి పాపారావు పై చర్యలు తీసుకోకుండా ఎందుకు వి ఆర్ ఎస్ కు ఆమోదం తెలిపారో వారికే తెలియాలి…కాగా డి టి సి విఆర్ ఎస్ ఆమోదం విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు పూర్తి గోప్యత ను పాటించారు…వి ఆర్ ఎస్ ఆమోదం పొందిన విషయం ఆశాఖలో ఎవరికి ఏమాత్రం తెలియకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది…రానున్న రెండు,మూడు రోజుల్లో పాపారావు వి ఆర్ ఎస్ ఆమోదం పొందిన విషయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది….