పశ్చిమ లో కమలం,హస్తానికి కష్టకాలం….

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు ఎన్నికల సమయంలో కష్టకాలం వచ్చినట్లు కనపడుతుంది… ఆ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు అసంతృప్తులతో సతమతం అవుతున్నట్లు కనపడుతుంది…చిన్న చితక నాయకులు ఆ పార్టీల్లో చేరిన మంచి పేరున్న నాయకులు పార్టీని వదలడం లేదా వారికి వ్యతిరేకంగా మారడం ఆ రెండు పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారిందట….దింతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కమలం,హస్తం పార్టీలకు కష్టకాలమే అంటూ నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది …మొన్నటివరకు టికెట్ ఆశించిన నేతలు టికెట్ రాకపోవడంతో సహాయ నిరాకరణ,లేదా పార్టీ మారే నిర్ణయాలతో తిరుగుబాటు జండా ఎత్తుతుండడంతో బీజేపీ అబ్యర్థిని రావు పద్మ,కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి ఎటు పాలుపోని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది….

రావు పద్మకు రాకేశ్ రెడ్డి ఎఫెక్ట్…

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి బరిలో దిగిన రావు పద్మ తనకు టికెట్ రావడం కోసం నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఏనుగుల రాకేశ్ రెడ్డి పార్టి కోసం ఏ పని చేసిన పూర్తిగా అడ్డు తగిలే వారని ప్రచారం జరుగుతోంది… వరంగల్ పశ్చిమ లోని కొంతమంది బీజేపీ నాయకులు సైతం రాకేశ్ రెడ్డి ఆరోపణలను కొట్టిపారేయడం లేదు…. హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న రావు పద్మ రాకేశ్ రెడ్డి ఎక్కడ దూసుకుపోతాడేమోననే అభద్రతా భావం తో పదే పదే రాకేశ్ రెడ్డి కి అడ్డుతగిలే ప్రయత్నం చేశారని కమలం పార్టీ కార్యకర్తలే అంటున్నారు…అకారణంగా పార్టీలో తనకున్న పలుకుబడితో పలుమార్లు నోటీసులు సైతం ఇప్పించారని వారు అంటున్నారు …కాగా రావు పద్మ,రాకేశ్ రెడ్డి మధ్య మొన్నటివరకు ఓ కోల్డ్ వార్ జరగగా, టికెట్ రావు పద్మకు రావడంతో కష్టపడ్డ తనకు పార్టీ అన్యాయం చేసిందని రాకేశ్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు…మరోవైపు ఈ విషయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాకేశ్ రెడ్డి పై సానుభూతి బాగానే కనపడుతుంది …నియోజకవర్గం లో పార్టీని బలోపేతం చేసిన రాకేశ్ రెడ్డి కి టికెట్ ఇవ్వకపోవడం పార్టీ తప్పిదమే అని పలువురు అంటున్నారు…కాగా రాకేశ్ రెడ్డి పార్టీని వీడడం వల్ల పశ్చిమ లో బీజేపీ కి గట్టి ఎదురు దెబ్బె పడింది…మొన్నటివరకు తామే విజయం సాదిస్తామని రావు పద్మ రాకేశ్ రెడ్డి ఎపిసోడ్ తో గెలుపుపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తుంది…రాకేశ్ రెడ్డి పార్టీని వీడడం వల్ల బీజేపీ ఓట్లకు భారీ స్థాయిలో గండి పడుతోందనే భయంతో రావు పద్మ ఉన్నట్లు సమాచారం…బయటకు తమదే గెలుపు అని రావు పద్మ అంటున్న లోలోపల మాత్రం డిపాజిట్ తెచ్చుకుంటే చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది… నియోజకవర్గంలో ఈ పరిస్థితిని చేతులార రావు పద్మ తెచ్చుకున్నారని పనిచేయని వారికి అధిక ప్రాధాన్యత నిస్తు పనిచేసే వారిని పక్కన పెట్టి వారిని నిత్యం అనుమానిస్తు వచ్చారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది…. టికెట్ విషయంలో ఎక్కడ ఎవరు తనకు పోటీకి వస్తారేమోనని అందరిని దూరం పెట్టారని త్వరలోనే ఇంకొంతమంది ఆసంతృప్తులు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది…ఇదేగనుక జరిగితే రావు పద్మ కు పశ్చిమ లో కష్టమేనని తెలుస్తుంది…

నాయినికి జంగా తలనొప్పి

ఇక పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నం చేసి ఎట్టకేలకు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న నాయిని రాజేందర్ రెడ్డికి ఇప్పుడు టికెట్ దక్కించుకున్న సంబరం కూడా లేకుండా పోయిందట …టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి సింహం గుర్తుపై పోటీచేస్తానని ప్రకటించడం నాయినీలో గుబులు మొదలయినట్లు తెలుస్తుంది…పశ్చిమ నియోజకవర్గంలో ఖాజీపేట,హన్మకొండలో జంగా కు విస్తృతమైన సంబంధాలు నగరానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అతని వెంటే ఉండడంతో నాయినికి పెద్దస్థాయిలో ఓట్లకు గండి పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది… కాగా నాయిని వద్ద సమర్థవంతంగా పనిచేసే వారు లేరని నాయకత్వ లేమితో ఆయన సతమతం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది… నియోజకవర్గంలో ఉన్న త్రిముఖ పోటీలో నెగ్గాలంటే నాయిని కి పనిచేసే నాయకులు అవసరమని చర్చ సాగుతోంది…. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ ,కాంగ్రెస్ అభ్యర్థులు చిక్కులతో సతమతం అవుతూ పోటీకి ముందే చేతులెత్తేసారనే కామెంట్లు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి….ఓ వైపు ఎన్నికల ప్రచారంలో బి ఆర్ ఎస్ అభ్యర్థి దూసుకుపోతుంటే రెండు పార్టీల అభ్యర్థులు మాత్రం ఓ వైపు ఇంటిపోరు మరోవైపు నాయకత్వ లేమి తో సతమతం అవుతున్నారని టాక్ వినపడుతోంది….ఇలా ఐయితే గెలుపు విషయం పక్కనబెడితే గౌరవప్రదమైన ఓట్లనైన దక్కించుకుంటారా….?చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here