గతంలో అక్కడ ఓ ఎమ్మెల్యే ఉండి బలమైన పాత క్యాడర్ ను కలిగివున్న పరకాల నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఇప్పుడు ఓ కొత్త పేరు వినపడుతోంది… పార్టీలో అత్యంత చురుకుగా పనిచేస్తూ పార్టీ భావజాలాన్ని యువతకు ,కాషాయం అభిమానులకు అందిస్తూ పరకాల నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్న
హన్మకొండ మండలం దామెర గ్రామ సర్పంచ్ శ్రీరాం రెడ్డి పరకాల నియోజకవర్గం నుంచి బరిలో నిలువనున్నట్లు తెలిసింది….గులాబీ హవాను సమర్థవంతంగా ఎదుర్కొని అంతటి హవాలో సైతం 2019 లో దామెర సర్పంచుగా ఎన్నికైనా శ్రీరాం రెడ్డి పరకాల నియోజకవర్గం నుంచి బరిలో నిలవడం ఖాయంగానే కనిపిస్తుంది….తమ నాయకుడు పరకాల నియోజకవర్గంలో ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కోగలడని టికెట్ ఇచ్చి ఇక్కడనుంచి బరిలో దింపితే గెలుపు కూడా సాధ్యమేనని అయన అనుచరులు అంటున్నారు….దామెర సర్పంచ్ గా కొనసాగుతున్న పరకాల నియోజకవర్గం మొత్తం కలియతిరుగుతూ బిజెపి బలోపేతానికి బాగానే కృషి చేశాడని అధిష్టానం వరకు మంచి పేరు ఉన్న శ్రీరాం రెడ్డి ఎమ్మెల్యే గా పరకాల నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి అన్నివిధాల అర్హుడేనని ఆయన అనుచరులు అంటున్నారు….
దశాబ్ద కాలంగా బీజేపీ లో….
2013లో భారతీయ జనతా పార్టీలో చేరిన శ్రీరాం రెడ్డి గత దశాబ్ద కాలంగా పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు…విద్యార్థి దశలో ఆర్ యస్ యస్ కార్యకర్తగా ఉన్న ఆయన 2014 ఎన్నికల్లో దామెర ఎంపీటీసీగా తన తల్లిని గెలిపించుకున్నారు….పార్టీ పదవుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఉమ్మడి ఆత్మకూరు మండలానికి మండల అధ్యక్షునిగా , దామేర మండల అధ్యక్షునిగా పార్టీకి సేవలందించారు…..సామాజిక సేవా దృక్పథంతో వివిధ పాఠశాలల్లో పిల్లలకు ఉపయోగపడే కంప్యూటర్స్ ప్రొజెక్టర్ ,స్కూల్ యూనిఫామ్స్, షూలు అందజేశారు.
దేవాలయాలకు చర్చిల అభివృద్ధికి ముందుండి తన వంతుగా ఆర్థిక సాయం అందజేశారు.అకాల మరణం చెందిన వారికి ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబాలకు అండగా నిలబడ్డారనే పేరు సైతం నియోజకవర్గంలో శ్రీరాం రెడ్డికి ఉంది…..దామెర గ్రామం 2016లో మండల కేంద్రంగా ఏర్పడడానికి ముందుండి సకల జనులను ఒక తాటిపై తీసుకొచ్చి దామెర మండలం గా మారడానికి ముందుండి ప్రముఖ పాత్ర వహించారు…దామెర మండలం నూతనంగా ఏర్పడిన తర్వాత మండల కార్యాలయాలకు రెండు ఎకరాల భూమిని దాతలను ఒప్పించి మండలాధికారులకు అందజేయడంలో ముఖ్యపాత్ర వహించారని తెలిసింది…..యువతకు చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి వారికి క్రికెట్ కిట్లు,వాలీబాల్ కిట్స్ జిల్లాస్థాయి టోర్నమెంట్లు మండల కేంద్రంలో తన సొంత డబ్బులతో ఏర్పాటు చేయడంలో ముందుంటు,
శ్రీరామ్ ఫౌండేషన్ ను స్థాపించి విద్యార్థులకు పరీక్షా సమయంలో పరీక్ష కిట్లను స్నాక్స్ ను మరియు అనారోగ్యమైన బాధితుల కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేస్తూ సేవారంగంలో సైతం శ్రీరాం రెడ్డి దూసుకుపోతున్నారనే పేరును ఆయన సొంతం చేసుకున్నారు….
శ్రీరాం రెడ్డి కి సానుకూలం….
పరకాల నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న దామెర సర్పంచ్ శ్రీరాం రెడ్డి కి సానుకూల వాతావరణమే కనిపిస్తుంది… పార్టీ కార్యక్రమాలన్నింటిలో చురుకుగా ఉండే ఆయన పట్ల బీజేపీ పార్టీ అధిష్టానం సైతం సానుకూలంగానే ఉంటుందని శ్రీరాం రెడ్డి అనుచరులు ఆశిస్తున్నారు…. ఎమ్మెల్యే గా పోటీచేయడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని వారు అంటున్నారు…. పరకాల నియోజకవర్గంలో సరైన అభ్యర్థి కోసం చూస్తున్న బీజేపీ అధిష్టానం శ్రీరాం రెడ్డి కి తప్పక అవకాశం కలిపిస్తుందని తమ నాయకుడు పరకాల బరిలో నిలవడం ఖాయమని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు….