వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొన్నటివరకు గెలుస్తామనే ధీమాలో ఉన్న బీజేపీ పశ్చిమ అభ్యర్థి రావు పద్మ గెలుపు మాట అటుంచితే గౌరవప్రదమైన ఓట్లు రావడం కోసం బాగా శ్రమించాల్సిన అవసరం ఉందనే టాక్ వినపడుతోంది… ప్రచారంలో బీజేపీ క్యాడర్ రావు పద్మకు అంతగా సహకరించడం లేదని తెలుస్తోంది…తాను తప్పక గెలుస్తానని పశ్చిమ లో బి ఆర్ ఎస్ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత తన గెలుపుకు బాటలు వేస్తుందని ఆశపడ్డ రావు పద్మకు ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డట్లు కనిపిస్తుంది…క్యాడర్ సహకారం అందక వరంగల్ పశ్చిమ లో కమలం అభ్యర్థి సతమతం అవుతున్నట్లు సమాచారం…. తన గెలుపుకోసం వరంగల్ పశ్చిమ లో ప్రచారం చేస్తున్న రావు పద్మ తో ఒక్కరిద్దరు బీజేపీ నాయకులు తప్ప ఎవరు సహకరించడం లేదని తెలిసింది…మరోవైపు మొన్నటివరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగిన ఏనుగుల రాకేశ్ రెడ్డి బి ఆర్ ఎస్ తీర్టం పుచ్చుకోవడం తో పశ్చిమ నియోజకవర్గం బీజేపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ పరిస్థితి ఏర్పడిందట…రాకేశ్ రెడ్డి తో ఉన్న అధిక శాతం బీజేపీ క్యాడర్ బి ఆర్ ఎస్ లోకి వెళ్లడంతో నియోజకవర్గం లోని కొన్ని డివిజన్లలో రావు పద్మ కు కనీసం సహకరించే క్యాడర్ కూడా లేకుండా పోయిందట… ఇక కొన్ని డివిజన్లలో క్యాడర్ ఉన్న బీజేపీ అభ్యర్థి ఇన్ని రోజులు వారిని పట్టించుకోకపోవడం ,పదవుల విషయంలో పనిమంతులకు కాకుండా అనర్హులను అందలం ఎక్కించారనే ఆరోపణల వల్ల ఆ క్యాడర్ పార్టీని అంటిపెట్టుకొని అలాగే ఉన్న రావు పద్మకు ఎన్నికల్లో సహకరించడానికి మాత్రం ముందుకు రావడం లేదని పశ్చిమ బీజేపీ లో చర్చ జరుగుతోంది….కాగా కేవలం రావు పద్మ మూలంగానే ప్రస్తుతం క్యాడర్ తనకు దూరమైందని పనిచేసేవారందరిని ఎదో ఒక రకంగా అనుమానించి పదవులకు దూరం పెడితే ఎవరు సహకరిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు….ఏదిఏమైనా మొన్నటివరకు గెలుపు తనదేనని తన అనుచరులు,సన్నిహితుల వద్ద సంబరపడ్డ రావు పద్మ ఇప్పుడు డిపాజిట్ తెచ్చుకోవడం కోసం విపరీతంగా శ్రమించాల్సిన అవసరం ఉన్నట్లు కనపడుతుందని ప్రచారం జరుగుతోంది….