గురుకులాల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో కాంట్రాక్టరుకు పదులకొద్ది కాంట్రాక్టులు,ప్రొవిజేన్స్ సరఫరా లో ఆ ఐదుగురి హవా,నాసిరకం సరుకుల సరఫరాపై న్యూస్10 గత కొద్దిరోజులుగా అందిస్తున్న వరుసకథనాలపై సాంఘీక సంక్షేమ గురుకులాల ఆర్ సి ఓ కు ఎక్కడ లేని కోపం వస్తుందట… ఆ ప్రొవిజేన్స్ కాంట్రాక్టర్లకు సహకరించడానికి ఆర్ సి ఓ తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తు వారిని వెనకేసుకురావడానికి… న్యూస్10 ను తిట్టడం కోసం ఓ ప్రణాళిక సిద్ధం చేసుకునట్లు తెలిసింది… ఇప్పటికే న్యూస్10 ను బద్నాం చేయండి అంటూ గురుకులాల ప్రిన్సిపాల్స్ కు ఆర్ సి ఓ ఆదేశాలు ఇచ్చారట… న్యూస్10 ను తిడుతూ ఓ ప్రెస్ మీట్ పెట్టాలని హన్మకొండ జిలాల్లోని ఓ గురుకులం ప్రిన్సిపాల్ కు ఆర్ సి ఓ ఉచిత సలహా ఇచ్చారట… ఐయితే తనకు సంభందం లేని విషయంపై తానెల ప్రెస్ మీట్ పెట్టాలని అప్రిన్సిపాల్ తలపట్టుకున్నట్లు తెలుస్తుంది…ఐయితే ఇదే ప్రిన్సిపాల్ కు ఆర్ సి ఓ బరితెగింపు బాధ్యతలు అప్పగించడానికి ఓ కారణం ఉందట… న్యూస్10 లో వస్తున్న కథనాలపై ఆర్ సి ఓ నిన్న సాయంత్రం ప్రిన్సిపాల్స్ తో ఓ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ జూమ్ మీటింగ్ లో ఈ ప్రిన్సిపాల్ తనకు సంబంధం లేకుండానే న్యూస్10 పై అవాకులు చవాకులు పేలారట…న్యూస్10 ప్రతినిధులను వాడు వీడు అంటూ బూతులు అందుకున్నారట… ఐయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ప్రిన్సిపాల్ పై న్యూస్10 కథనం రాయడం కానీ ,ఆ ప్రిన్సిపాల్ ను ఏ విషయంలో కూడా న్యూస్10 ప్రతినిధులు సంప్రదించలేదు కానీ ఈ ప్రిన్సిపాల్ ము మాత్రం న్యూస్10 పత్రికపై ఎక్కడలేని అక్కసు ఉన్నట్లు జూమ్ మీటింగ్ లో మాటల ద్వారా స్పష్టం ఐయినట్లు తెలియవచ్చింది…ఈ విషయం తెలిసిన వెంటనె ఈ ప్రిన్సిపాల్ విషయంలో ఆరా తీస్తే ఇతగాడి బిల్లుల దందా,అలాగే గురుకులానికి చెందిన ఐరన్ స్క్రాప్ అమ్ముకున్న ఆరోపణలో అధికారుల విచారణను ఎదుర్కుంటున్నట్లు తెలిసింది…ఈ ప్రిన్సిపాల్ అక్రమ లీలల బండరాన్ని న్యూస్10 త్వరలోనే బయటపెడుతుంది
ఆర్ సి ఓ ఎందుకిలా….?
గురుకులాల్లో జరుగుతున్న కాంట్రాక్టర్ల అవినీతిని న్యూస్10 ప్రశ్నిస్తూ కథనాలు వెలువరిస్తుంటే ఆర్ సి ఓ కు ఎందుకో ఎక్కడలేని బాధ ఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదు…న్యూస్10 ను టిట్టండి…ప్రెస్ మీట్ పెట్టండి అని పనికిమాలిన ఆదేశాలు ప్రిన్సిపాల్స్ కు ఇస్తున్నారంటే ప్రొవిజేన్స్ కాంట్రాక్టర్ల కు ఆర్ సి వి ఏ స్థాయిలో సహకరిస్తున్నారో అర్థం అవుతుంది…నకిలీ సరుకులు వచ్చిన పర్వాలేదు… ఆ కాంట్రాక్టర్లు సంవత్సరాల కొద్దీ పాతుకుపోయిన పర్వాలేదు…ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో కాంట్రాక్టర్ పదుల సంఖ్యలో కాంట్రాక్టులు దక్కించుకున్న పర్వాలేదు కానీ ఎవరూ ప్రశ్నించొద్దు అన్నట్లు ఆర్ సి ఓ వ్యవహరించడం వెనకాల మతలబు ఏంటో ఆర్ సి ఓ కె తెలియాలి…
ఆర్ సి ఓ ఎందుకిలా….?
అసలు తెరవెనుక నడుస్తుందేంటి…?
కాంట్రాక్టర్లకు చెక్ పెట్టేదెవరు….?
మరో కథనంలో
……