నేనింతే….!!

ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రొవిజేన్స్ టెండర్లు దక్కించుకుని కాంట్రాక్టర్ గా పాతుకుపోయిన “సోమశేఖర” గురుకులాలకు నాసిరకం సరుకులు సరఫరా చేయడంలో అందెవేసిన చెయ్యి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి… సరుకులు తక్కువ ధర ఉన్నప్పుడు కొనుగోలు చేసి వాటిని గోడౌన్ లల్లో నెలలకొద్ది నిల్వ చేసి ప్రతినెలా వాటినే గురుకులాలకు సరఫరా చేసిన ఇతగాడిని ప్రశ్నించేవారే లేరట…అంతేకాదు నెల నెలా సరుకులు ఎలా ఉన్నాయి…ఏమి తెచ్చారు….వాటి నాణ్యత ఎలా ఉంది…?అని పరిశీలించాల్సిన గురుకులాల ప్రిన్సిపాల్స్ సైతం ఇతగాడి నాసిరకం దందా కు వంత పాడినట్లు సహకరిస్తుండడంతో సోమశేఖర నాసిరకం సరుకుల దందా “మూడు పువ్వులు ఆరు కాయలు” గా వర్ధిల్లుతున్నట్లు తెలుస్తుంది….అటు కాంట్రాక్టర్ గా ఏళ్ల కొద్దీ గురుకులాల్లో పాతుకుపోయిన అనుభవం ఇటు కొందరు అధికారుల సహకారంతో తనకు ఎదురు లేదంటూ సోమశేఖర రెచ్చిపోతున్నట్లు తెలియవచ్చింది…వరంగల్ నగరంలో పెద్ద స్థాయిలో కిరాణా దుకాణం నడుపుతున్న ఇతగాడు అందులో ఉన్న సరుకులు ఎలా తేవాలి…ఎలా బురిడీ కొట్టించాలో బాగా తెలుసు కాబట్టి ఆ అనుభవాన్ని బాగా రంగరించి నాసిరకం సరుకులు గురుకులాలకు సరఫరా చేస్తున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది…..

ఆయనకు తోడు మరో నలుగురు….?

గురుకులాల్లో నాసిరకం సరుకుల సరఫరా విషయంలో సోమశేఖరకు తోడుగా మరో నలుగురు కాంట్రాక్టర్లు ఇదే  దందాను కొనసాగిస్తున్నారు …వీరంతా ఓ జట్టు గా ఏర్పడి సరుకులు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తాయో ఒకరికొకరు సమాచారాన్ని చేరవేసుకొని మరీ నాసిరకం సరుకులను సరఫరా చేస్తున్నట్లు సమాచారం…. అంతేకాదు టెండర్లు వేసి కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం కొందరు కాంట్రాక్టర్లు అందరూ కలిసి సిండికేట్ గా ఏర్పడి టెండర్ వారికే వచ్చేలా చక్రం తిప్పుతుండగా వీరికి సిండికేట్ సూత్రధారిగా సోమశేఖర వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ…మొత్తానికి వీరు ఎంటర్ ప్రైజెస్,ట్రేడర్స్ పేరుతో నాసిరకం సరుకుల దందా ను ఎలాంటి అడ్డు అదుపు లేకుండా నడుపుతున్నట్లు తెలియవచ్చింది….

ఎంత రాస్తారో చూస్తా….?

ప్రొవిజేన్స్ కాంట్రాక్ట్ పేరుతో తాను గురుకులాలకు సరఫరా చేస్తున్న నాసిరకం సరుకుల గూర్చి,ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాను కాంట్రాక్టర్ గా పాతుకుపోయిన విషయం గూర్చి న్యూస్10 లో వస్తున్న వరుస కథనాలపై సోమశేఖర ఇష్టారీతిన మాట్లాడుతున్నట్లు తెలిసింది…చేసేదే దొంగ పని విద్యార్థులు తినే తిండిని నాసిరకంగా మార్చి వారి తిండితో దందా చేస్తూ కోట్లు కూడబెడుతున్న ఇతగాడు న్యూస్10 పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం హస్యాస్పదం …న్యూస్10 ప్రతినిధిని ఉద్దేశించి అనుచిత వాఖ్యలు చేయడం అతగాడి నాసిరకం దందా ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది….

సహకరించేది ప్రిన్సిపాల్లే….?

రింగ్ మాస్టర్ అతగాడే….

మరో సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here