రాష్ట్ర స్థాయి మత్య్స శాఖ విభాగంలో కొంత మంది ఉన్నత అధికారులను మచ్చిక చేసుకొని వారి అండదండలతో అనేక అక్రమాలకు పాల్పడుతూ పదేళ్లుగా ఒకే చోట ఎలాంటి బదిలీలు లేకుండా విధులు నిర్వహిస్తున్న వరంగల్ డీ ఎఫ్ ఓ నాయుడి గారి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొంది అనతికాలంలోనే అనేక పదోన్నతులు పొందిన ఆయన పై అవినీతి ఆరోపణలే కాకుండా మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తూ రక్షసానందం పొందుతున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ మహిళా ఉద్యోగి ఇతగాని వేధింపులు భరించలేక మత్య్స శాఖ కమిషనర్ కు ,హన్మకొండ కలెక్టర్ కు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వరంగల్
మత్య్స శాఖ లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను దుర్భాషలాడుతూ ,ద్వంద అర్ధ పదాలతో నిత్యం వేధింపులకు గురి చేస్తూ వారిని శారీరకంగా లొంగ దీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని మహిళా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తనకు నచ్చిన విధంగా నడుచుకోకపోతే వారిపై పని ఒత్తిడి పెంచి అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తూ నానా భూతులు తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తాడట.తాజాగా ఇతగాడి వేధింపులు భరించలేక ఇతడి ప్రవర్తన తో విసిగిపోయిన ఓ మహిళా ఉద్యోగి మత్య్స శాఖ కమీషనర్ కు రాతపూర్వకంగా పిర్యాదు చేసింది.గత నెల 20 వ తేదీన డీ ఎఫ్ ఓ పై చర్యలు తీసుకోవాలని లేఖలో విన్నవించుకున్నా నేటికీ అతనిపై ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధపడట్లేరంటే అతగాని పలుకుబడి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.పైగా మత్య్స శాఖలో ఏ డీ గా కొనసాగుతున్న ఓ ఉన్నతాధికారి డీ ఎఫ్ ఓ పై మహిళా ఉద్యోగి చేసిన పిర్యాదు కాపీని కమిషనర్ దృష్టికి వెళ్లకుండా అడ్డుకొని బాధితురాలికి,డీ ఎఫ్ ఓ కు మధ్య సంధి కుదిర్చేలా ప్రయత్నం చేస్తున్న ఓ ఆడియో బయటకు వచ్చింది.ధీంతో ఏడీ వివరణ కోసం న్యూస్ 10 ప్రతినిధి ఏడీ కి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ వారు స్పందించ లేదు.ఇదిలా ఉంటె పత్రికలో రాయలేని భాష లో మహిళా ఉద్యోగి నోరువిప్పి చెప్పలేని మాటలతో సభ్య సమాజం తల దించుకునే విధంగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడిన డీ ఎఫ్ ఓ మాత్రం తన క్రింది స్థాయి ఉద్యోగులతో మీరు అందరూ కలిసినా నన్నేం చేయలేరు.ఒక్కొక్కరి అంతు చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. అనేక అక్రమాలకు పాల్పడుతూ తన కూతురు వయసుండే క్రింది స్థాయి ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించిన డీ ఎఫ్ ఓ పై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలకు వెనుకాడుతున్నారో ఇప్పటికి అర్ధం కావట్లేదని ఆఫీసులో చర్చించుకుంటున్నారట. వేచి చూడాలి మరి ఇప్పటికైనా వరంగల్ డీ ఎఫ్ ఓ పై ఎలాంటి చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధపడుతారో మరి….